పవన్ కళ్యాణ్ చేసిన పనే రవితేజ చేస్తాడా ఏంటి!
ప్రతిభ గల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చివరగా తెరకెక్కించిన చిత్రం హైపర్. ఈ చిత్రం తరువాత సంతోష్ శ్రీనివాస్ మరో చిత్రం చేయలేదు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసే అవకాశం సంతోష్ శ్రీనివాస్ కు దక్కిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని సినీవర్గాలు కూడా తేల్చాయి.
తమిళ హీరో విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తేరి కథని సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా మార్పులు చేసి రెడీ చేసుకున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరచడం, ఆ తరువాత పవన్ రాజకీయాలతో బిజీ కావడం జరిగిపోయింది. అప్పటి వరకు సంతోష్ శ్రీనివాస్ పవన్ కోసం ఎదురుచూశాడు. ఇక కుదరదని పవన్ తేల్చేయడంతో ఈ దర్శకుడు రవితేజని లైన్ లో పెట్టాడు.

రవితేజ షెడ్యూల్ చూస్తుంటే ఇప్పట్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. త్వరలో రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రవితేజ తేరి చిత్ర రీమేక్ ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై రవితేజ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











