మహేష్ బాబుతో సోప్ వేయించడానికి రంగం సిద్ధం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో విప్రో గ్రూపుకు చెందిన సంతూర్ సోప్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన యాడ్ ప్రమోషన్ కాంపేయిన్ బుధవారం ప్రారంభించింది సంతూర్ సోప్ కంపెనీ. విప్రో కన్య్సూమర్ కేర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. సాధారణంగా ప్రతి 18-25 నెలలకు ఒక సారి బ్రాండ్ అంబాసిడర్లను మారుస్తుంటామని, అందులో భాగంగా ఈ సారి మహేష్ బాబును ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆంద్రప్రదేశ్‌లో నెం.1 స్తానంలో ఉన్న సంతూర్ సోప్‌కు మహేష్ బాబుతో ప్రచారం చేయిస్తే సేల్స్ మరింత పెరుగుతాయనే నమ్మకం వ్యక్తం చేశారు.
మహేష్ బాబు దీంతో పాటు పలు కార్పొరేట్ కంపెనీ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నా సంగతి తెలిసిందే. ఐడియా 3జితో పాటు, థమ్సప్, యూనివర్శల్ మొబైల్ మరికొన్ని కంపెనీలు ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటన్నింటి నుంచి మహేష్ బాబుకు కోట్లాది రూపాయల ఇన్‌కం వస్తోంది. సినిమాల్లో నటిస్తే వచ్చే ఆదాయం కంటే వీటి ద్వారానే మహేష్ బాబు ఎక్కువ సంపాదిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











