Kalyanam Kamaneeyam ట్విట్టర్ రివ్యూ: సంతోష్ శోభన్ మూవీకి షాకింగ్ టాక్.. సంక్రాంతి సినిమా ఇలానా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో సంతోష్ శోభన్ ఒకడు. చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తోన్న అతడు.. హీరోగా మారిన తర్వాత వైవిధ్యాన్ని చూపిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంతోష్ 'కళ్యాణం కమనీయం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి!

కళ్యాణం కమనీయం అంటూ వచ్చి

కళ్యాణం కమనీయం అంటూ వచ్చి

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రమే 'కళ్యాణం కమనీయం'. అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్టు బ్యానర్‌పై నిర్మించారు. దీనికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇందులో దేవీ ప్రసాద్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్, సత్యం రాజేష్, సప్తగిరిలు నటించారు.

అలాంటి కథ.. సంక్రాంతి పోటీలోనే

అలాంటి కథ.. సంక్రాంతి పోటీలోనే

సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' మూవీ.. పనీ పాట లేని ఓ కుర్రాడు.. ఉద్యోగి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎదరయ్యే సమస్యలతో ఫన్ అండ్ ఎమోషన్స్‌తో తెరకెక్కింది. ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల చిత్రాలకు పోటీగా జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ఈ మూవీకి షాకింగ్ టాక్

ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'కళ్యాణం కమనీయం' మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు స్పందన ఓ మాదిరిగానే ఉంది. అలాగే, ట్విట్టర్‌లో ఈ చిత్రానికి ఒక రకంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది దీనిపై ట్రోల్స్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

సినిమా ఫస్టాఫ్ ఎలా ఉందో చెప్తూ

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'కళ్యాణం కమనీయం' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అందులో 'కళ్యాణం కమనీయం మూవీ ఫస్టాఫ్ పూర్తైంది. దీని గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టుతో ఇప్పటి వరకూ బోరింగ్‌గా సాగింది. ఇది ఓటీటీ కోసం రూపొందించినట్లుగా అనిపించింది' అంటూ పేర్కొన్నాడు.

అసలు ఇది పూర్తి సినిమానే కాదు

సంతోష్ శోభన్ నటించిన ఎంటర్‌టైనర్ మూవీ 'కళ్యాణం కమనీయం'ను చూసిన మరో నెటిజన్ ''కళ్యాణం కమనీయం' పూర్తి స్థాయి నిడివి ఉన్న సినిమానే కాదు. ఇది కాస్త సాగదీసిన షార్ట్ ఫిల్మ్‌లా అనిపించింది. దేనికది సంబంధం లేకుండా పేలవంగా రాసిన కథ అని చెప్పొచ్చు. మొదటి నుంచి ముగింపు వరకూ బోరింగ్‌గానే ఉంది' అంటూ ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డాడు.

మూవీ బాగుందన్న మరో నెటిజన్

పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య జరిగే గొడవలతో సాగే కథతో రూపొందిన 'కళ్యాణం కమనీయం' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'కళ్యాణం కమనీయం బాగుంది. సింపుల్‌గా, ఫీల్‌ గుడ్‌గా భార్య భర్తల సమస్యలను బాగా చూపించాడు. కామెడీ కూడా బాగుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా చూసే సినిమా అని చెప్పుకోవచ్చు' అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

మూవీలో అదొక్కటే సమస్య అని

మూవీలో అదొక్కటే సమస్య అని


సంతోష్ శోభన్ - ప్రియా భవానీ శంకర్ కాంబోలో వచ్చిన 'కళ్యాణం కమనీయం' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. ఈ మేరకు 'కళ్యాణం కమనీయం మూవీని జాబ్ చేసే భార్య, ఖాళీగా ఉండే భర్త కాన్సెప్టుతో బాగా తీశారు. సంతోష్ నటన బాగుంది. ప్రియా చాలా క్యూట్‌గా ఉంది. ఈ సినిమా నిడివే సమస్య. ఇంకా ఎక్కువ ఉండొచ్చు' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X