twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘స్పైడర్’ కెమెరా‌మెన్ సెన్సేషనల్ ట్వీట్... చట్టబద్దమైన హెచ్చరిక!

    మెర్సల్ సినిమా వివాదం మీద ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సంచలన ట్వీట్ చేశారు.

    By Bojja Kumar
    |

    తమిళ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' మూవీ మీద నాలుగు రోజులుగా పెద్ద వివాదం నడుస్తోంది. సినిమాలో జిఎస్‌టిని ఉద్దేశించిన చేసిన కొన్ని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ వివాదంలో సినిమా రంగానికి చెందిన పలువురు 'మెర్సల్' సినిమాకు మద్దతుగా నిలిచారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఇటీవల 'స్పైడర్' చిత్రానికి పని చేసిన సంతోష్ శివన్ సంచలన ట్వీట్ చేశారు.

     త్వరలో, కొత్త చట్టబద్దమైన హెచ్చరిక

    త్వరలో, కొత్త చట్టబద్దమైన హెచ్చరిక

    ఈ వివాదం మీద సంతోష్ శివన్ స్పందిస్తూ ‘త్వరలో ప్రతి సినిమాలో ఒక చట్టబద్దమైన హెచ్చరిక ప్రదర్శిస్తారు. ‘సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హాని తలపెట్టేలా ఎలాంటి పనులు చేయలేదు' అనే ఒక ఒక ప్రకటన చేయాలేమో? అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు.

     సాధారణంగా ఇలా ఉంటాయి

    సాధారణంగా ఇలా ఉంటాయి

    సాధారణంగా అయితే.... ‘సినిమా చిత్రీకరణ సమయంలో ఏ జంతువుకు, పక్షులకు హాని తలపెట్టలేదు' అనే ప్రకటన సినిమా ప్రదర్శించే ముందు చూస్తూ ఉంటాం. ఇపుడు సంతోష్ శివన్ ‘మెర్సల్' సినిమా వివాదం నేపథ్యంలో ‘నో గవర్నమెంట్ వర్ హార్మ్‌డ్ డ్యూరింగ్ ది మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్' అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది.

     తమిళ సినిమా ప్రముఖుల మద్దతు

    తమిళ సినిమా ప్రముఖుల మద్దతు

    ‘మెర్సల్' సినిమాకు తమిళ సినిమా ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోంది. జిఎస్‌టీ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఇందులో తప్పేముంది? అంటూ అరవింద స్వామి ఇటీవల ట్వీట్ చేశారు.

     రజనీకాంత్ ట్వీట్

    రజనీకాంత్ ట్వీట్

    ‘మెర్సల్' సినిమా చూసిన రజనీకాంత్ కూడా ఈ సినిమా బావుందంటూ మెచ్చుకున్నారు. ఆయన ప్రత్యేకించి బీజేపీ లేవనెత్తిన వివాదం గురించి స్పందించక పోయినా... సినిమా బావుందని చెప్పడం ద్వారా తన సపోర్టు తెలిపారు.

    English summary
    Cinematographer Santosh Sivan Sensational Tweet on Mersal controversy. 'Coming Soon. Films to display new statutory warning. "No Governments were harmed during the making of this film'. he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X