‘పేపర్ బాయ్’పై భారీ ఆశలు పెట్టుకున్న సంతోష్ శోభన్
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కెరీర్ పరంగా దర్శకుడు జయశంకర్‌కు ఈ సినిమా ఎంత ముఖ్యమో హీరో సంతోష్ శోభన్‌కు కూడా అంతే ముఖ్యం. గోల్కొండ హైస్కూల్ మూవీలో బాల నటుడిగా మెప్పించిన సంతోష్ శోభన్ తర్వాత 'తను నేను' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో 'పేపర్ బాయ్' తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఇటీవల విడుదలైన 'పేపర్ బాయ్' పోస్టర్లో సంతోష్ శోభన్ లుక్ బావుందనే టాక్ వినిపించింది. ఇంతకీ సంతోష్ శోభన్ ఎవరో తెలుసా? తెలుగులో..... 'వర్షం' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన ఫేమస్ దర్శకుడు శోభన్ కుమారుడు.
చిన్నతనం నుండి సినిమా వాతావరణంలో పెరిగి నటనపై ఆసక్తి పెంచుకున్న శోభన్.... థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసిన అనంతరం గోల్కొండ హైస్కూల్ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. తొలి సినిమాలో అతడి నటన ఆకట్టుకోవడంతో 'తను నేను' మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్ కాక పోయినా... పెర్ఫార్మెన్స్ పరంగా సంతోష్ శోభన్ క్రిటిక్స్ ప్రశంలు అందుకున్నారు. కాస్త గ్యాప్ తీసుకున్నా మంచి కథతో, కెరీర్‌కు ప్లస్సయ్యే సినిమాతో రావాలని డిసైడైన సంతోష్ శోభన్ 'పేపర్ బాయ్' ద్వారా ప్రేక్షకులను రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











