'కందిరీగ' దర్శకుడి పై మనస్సు పడ్డ అల్లు అర్జున్...!
కందిరీగ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ శ్రీనివాష్ తొలి సినిమాతోనే సత్తా చాటుకున్నాడు. రొటీన్ కథతోనే ఈ సినిమా తెరకెక్కించినా కానీ సంతోష్ కమర్షియల్ ఫార్ములాని బాగా వంటబట్టించుకున్నాడని అర్థమయింది. కామెడీ, మాస్ ఎలిమెంట్స్ బాగా క్లిక్ అవడంతో కందిరీగ చిత్రం ఇప్పుడు అంతటా ఆదరణ పొందుతోంది.
ఎవరైనా సరే సక్సెస్ వెంటే పరిగెడతారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్క హిట్ వస్తే చాలు... పెద్ద పెద్ద వాళ్లు కూడా దాని వెంట పడతారు. అందుకే, ఓ కొత్త దర్శకుడు ఓ హిట్ ఇవ్వగానే పెద్ద హీరోలు కూడా డేట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు కొత్త దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి కూడా ఆఫర్లు అలాగే వున్నాయి.
అతను తొలిగా డైరెక్ట్ చేసిన 'కందిరీగ' సినిమా హిట్ అవ్వడంతో, చాలా మంది హీరోలు అతనితో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. చాన్నాళ్లుగా ఓ హిట్ కోసం ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ కూడా అతనితో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దాంతో, వీరి కాంబినేషన్లో ఓ నిర్మాత సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే రెండో సినిమా అల్లు అర్జున్ తోనే అవుతుందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతానికి బన్నీ డైరీ బిజీగా ఉంది. డిసెంబర్ లో త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టనున్న అల్లు అర్జున్, దాంతో పాటు సైమల్టేనియస్ గా వాసు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇవి కాక అతనికి సెల్వ రాఘవన్ తో ను ఒక కమిట్ మెంట్ ఉంది. కనుక అల్లు అర్జున్ తో చేసే చిత్రం కోసం సంతోష్ కొన్నాళ్లు వేచి ఉండాలి..


Click it and Unblock the Notifications











