సంతోషం హీరోయిన్ చివరకి..
నాగార్జున సంతోషం చిత్రంలో చేసిన గ్రేసీ సింగ్ గుర్తుంది కదా. లగాన్ చిత్రంతో అమీర్ ఖాన్ ప్రక్కన చేసి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మున్నాభాయ్ఎంబిబియస్ మినహా బాలీవుడ్లో చెప్పుకోతగ్గవేమీ చేయలేదు. అలాగని తెలుగుకు వచ్చి సంతోషం, తప్పుచేసి పప్పుకూడు చిత్రాలు చేసింది. కానీ ఇక్కడా బిజీ కాలేకపోయింది. సరైన పిఆర్ లేకపోవటమే దానికి కారణమని అంటారు. అయితే ఇప్పుడు ఆమె రామ్ దేవ్ అనే ఊరూ పేరూ లేని చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని సిట్యువేషన్ లో ఆ సినిమా ఉంది. అందులోనూ ఆ దర్శక, నిర్మాత బషీద్ చాలా ఫ్రాడ్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు. ఇది గమనించిన వారు ఎక్కడ ఆ గ్రేస్..ఈ సినిమాలో చేయకుండా ఉన్నా బావుండేదమో అంటున్నారు. తెలివిగా ఏ అక్క పాత్రలకో టర్న్ అయిపోతే బావుండేది..అనవసరంగా ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. ఏదైమైనా సంతోషం వంటి చిత్రంలో అదరకొట్టిన ఆమె ఇలా దర్శనమివ్వటం మాత్ర ఊహించలేని విషయమే.


Click it and Unblock the Notifications











