twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సప్తగిరి పనైపోయింది.. అందరూ పెదవి విరిచారు.. షాకిచ్చిన నిర్మాత

    కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా.

    By Rajababu
    |

    Recommended Video

    Hero Saptagiri New Movie Audio Released సప్తగిరి పనైపోయింది

    కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా నిర్మిస్తోన్న విభిన్న చిత్రం 'సప్తగిరి ఎల్‌ ఎల్‌బి'. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి, సాయికుమార్‌ కలిసి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు.

    హీరోగా ఎదిగిన వ్యక్తి

    హీరోగా ఎదిగిన వ్యక్తి

    సప్తగిరి తక్కువ కాలంలోనే హాస్య నటుడిగా అందరినీ నవ్వించి హీరోగా ఎదిగిన వ్యక్తి. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంతో హీరోగా సక్సెస్‌ను సాధించి ఇప్పుడు సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో నేను మంచి పాత్ర చేశాను. నిర్మాత రవికిరణ్‌గారు డాక్టర్‌. వృత్తిరీత్యా ఆయనెంతో బిజీ అయినా, సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలను చేస్తున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని జయప్రకాష్‌ రెడ్డి అన్నారు.

    సప్తగిరి కమిట్‌మెంట్‌ ఉన్న హీరో

    సప్తగిరి కమిట్‌మెంట్‌ ఉన్న హీరో

    ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి సినిమా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. 'ప్రస్థానం', 'సామాన్యుడు' తర్వాత ఆ రేంజ్‌ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నాకు నేనే కొత్తగా కనిపించాను. సప్తగిరి చాలా కమిట్‌మెంట్‌ ఉన్న హీరో. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేయడం వల్ల తనకు మంచి కథలను ఎన్నుకోవడంలో మంచి పట్టుంది. ప్రతిదీ కొత్తగా చేయాలని తపన పడుతుంటాడు. ఈ సినిమాలో కొత్త లుక్‌, స్టైలిష్‌గా కనపడతాడు.అన్నీ ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇది. సినిమాలో ఈగోయిస్ట్‌ లాయర్‌ పాత్రలో నటించాను. సప్తగిరి ఈ సినిమాతో కామన్‌ మేన్‌కి చాలా దగ్గరవుతాడు అని సాయికుమార్ అన్నారు.

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఏ సినిమా చేయాలని తర్జన భర్జనలు పడ్డాం. చాలా స్క్రిప్ట్స్‌ విన్నాం. ఏదీ నచ్చలేదు. ఆ సమయంలో హిందీలో విడుదలైన జాలీ ఎల్‌ఎల్‌బి సినిమా చూశాం..ఆ సినిమా ఎంతో నచ్చింది. భారీ రేటు ఇచ్చి సినిమాను సొంతం చేసుకున్నారు. మంచి మెసేజ్‌ ఉన్న సినిమా. ఈ సినిమాలో హెవీ క్యారెక్టర్‌ను సప్తగరి చక్కగా క్యారీ చేశాడు. సాయికుమార్‌గారు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయన, సప్తగిరి ఇద్దరూ హీరోలుగా కనపడతారు అని నిర్మాత రవికిరణ్‌ అన్నారు.

    సప్తగిరి హీరోగా అన్నప్పుడు

    సప్తగిరి హీరోగా అన్నప్పుడు

    సప్తగిరి హీరోగా చేయడానికి సిద్ధమైనప్పుడు సప్తగిరి పని అయిపోయిందంటూ చాలా మంది పెదవి విరిచారు. అయినా సప్తగిరి హీరోగా సక్సెస్‌ అయ్యాడు. మంచి టాలెంట్‌ ఉన్న హీరో. కమర్షియల్‌ హీరోగా సప్తగిరి ఎదగాలని కోరుకుంటున్నాను అని నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

    పెద్ద హిట్‌ సాధించాలి

    పెద్ద హిట్‌ సాధించాలి

    పరుగు సినిమాకు సప్తగిరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించాడు. అప్పటి నుండి మా మధ్య మంచి పరిచయం ఉంది. ప్రేమకథా చిత్రమ్‌తో కమెడియన్‌ ఎదిగిపోయాడు సప్తగిరి. తనకు కథలపై మంచి పట్టు ఉంది. ఈ సినిమాతో తను పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను అని కమెడియన్ శ్రీనివాసరెడ్డి అన్నారు.

    లాయర్‌ పాత్రలో సాయికుమార్‌

    లాయర్‌ పాత్రలో సాయికుమార్‌

    డబ్బింగ్‌ కూడా పూర్తి చేసేశాం. సినిమా చాలా బాగా వచ్చిందని చూసిన వారందరూ అంటున్నారు. చెన్నైలో రీరికార్డింగ్‌ జరుగుతుంది. సాయికుమార్‌గారు సినిమాలో కీలకమైన లాయర్‌ పాత్రలో నటించారు. మేకింగ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కావద్దని నిర్మాత రవికిరణ్‌గారు మంచి టీంను సమకూర్చారు. సప్తగిరి మంచి విలువలున్న వ్యక్తి. పదేళ్ల కిత్రం నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నాతో ఇప్పుడు సినిమా చేశాడు చిత్ర దర్శకుడు చరణ్‌ పేర్కొన్నారు.

    సప్తగిరి అనే బ్రాండ్‌

    సప్తగిరి అనే బ్రాండ్‌

    2009 నుంచి సప్తగిరితో నాకు స్నేహబంధం ఉంది. సప్తగిరి అనే బ్రాండ్‌ను సప్తగిరి క్రియేట్‌ చేసుకుంటున్నాడు. సప్తగిరి మిత్రుడుగా నేను సంతోషంగా ఉన్నాను. తను ఇంకా మంచిస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. టీజర్‌ చాలా బావుంది అని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.

    నమ్మకంతోనే ఈ సినిమా

    నమ్మకంతోనే ఈ సినిమా

    సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఏ సినిమా చేయాలని నేను, రవికిరణ్‌గారు ఆలోచనలో పడ్డాం. అప్పుడు నేను ఓ సబ్జెక్ట్‌ చెప్పాను. అయితే అది భారీ బడ్జెట్‌ మూవీ. అంత బడ్జెట్‌ మూవీ వద్దని, వేరే సినిమా చేద్దామని అన్నారు. ఆ సమయంలో జాలీ ఎల్‌ఎల్‌బి సినిమా చూసి నచ్చడంతో ఫ్యాన్సీ రేటుతో హక్కులను దక్కించుకున్నారాయన. చరణ్‌ తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి సినిమాను చక్కగా తెరకెక్కించారు. నా మీద నమ్మకంతో ఈ సినిమా చేయగలవని నిర్మాతగారు ఈ సినిమాను చేయించారు. రవికిరణ్‌గారికి థాంక్స్‌ అని హీరో సప్తగిరి తెలిపారు.

    English summary
    After Saptagiri express, Hero Saptagiri doing now Saptagiri LLB. This movie's Audio release function organised recently. Film personalities Anil Ravipudi, Srinivas Reddy others attended for this function. Saptagiri expressed confidence on Saptagiri LLB success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X