For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భావోద్వేగానికి లోనై కన్నీళ్లు.. సింహంతో ఢీకొన్నట్లే.. హీరో సప్తగిరి..

  By Rajababu
  |

  కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా కశిష్‌ వోరా హీరోయిన్‌గా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయిసెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై అభిరుచిగల నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. ఈ చిత్రం డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజై సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా పరుగులు తీస్తుంది. రైతులు బతకాలి. అందరికీ సమానమైన న్యాయం దక్కాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

  Saptagiri LLB Public Talk సప్తగిరి LLB మూవీ పబ్లిక్ టాక్

  సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి పోటాపోటీగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్‌ అద్భుతమైన టేకింగ్‌తో ప్రజెంట్‌ చేశారు. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, నిర్మాత రవికిరణ్‌ మేకింగ్‌ వేల్యూస్‌ ప్రధాన ఎస్సెట్‌గా నిలిచాయి. కాగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని డిసెంబర్‌ 9న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, హీరోయిన్‌ కశిష్‌ వోరా, స్టార్‌ రైటర్స్‌ పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు చరణ్‌ లక్కాకుల, ఎడిటర్‌ గౌతంరాజు, నిర్మాత డా. రవికిరణ్‌ పాల్గొన్నారు.

   మీడియా సపోర్ట్‌తోనే..

  మీడియా సపోర్ట్‌తోనే..

  హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రాన్ని మౌత్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ చేశారు. ఈ సినిమాకి మీడియా చేసిన సపోర్ట్‌ ఎంతో హెల్ప్‌ అయ్యింది. ఎంతో గొప్పగా ప్రజల్లోకి మా సినిమాని తీసుకెళ్ళారు. అలాగే బి.ఎ.రాజుగారు సినిమా స్టార్టింగ్‌ నుండి ఎంతో ఎంకరేజ్‌ చేస్తూ మాలో కాన్ఫిడెన్స్‌ని మరింత పెంచారు. లైఫ్‌లాంగ్‌ ఆయనతో నా జర్నీ కొనసాగిస్తాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కామన్‌ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. లాస్ట్‌ నలభై ఐదు నిమిషాలు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుని చూస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌కి క్లాప్స్‌, విజిల్స్‌ పడుతున్నాయి అని అన్నారు.

   డైరెక్టర్‌ చరణ్‌ విజయం.

  డైరెక్టర్‌ చరణ్‌ విజయం.

  ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ప్రేక్షకులే. అలాగే సినిమాని తన అద్భుతమైన ఎడిటింగ్‌తో అందంగా ప్రజెంట్‌ చేసిన గౌతంరాజుగారు ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌ అని చెప్పాలి. ఆయనకి నా థాంక్స్‌. డైరెక్టర్‌ ఇరవై ఐదు సంవత్సరాలుగా కో-డైరెక్టర్‌గా చేసి ఎన్నో కష్టాలు పడి ఓర్పు, సహనంతో ఈ సినిమా చేశాడు. ఆయన క్యారెక్టర్‌ని నమ్మి అవకాశం ఇచ్చాను. నాలో వున్న పెర్‌ఫార్మెన్స్‌ని ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకున్నారు. ఇది డైరెక్టర్‌ చరణ్‌ విజయం.

   ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌

  ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌

  ఒక గొప్ప సినిమాని విజయాన్ని దర్శకుడు చరణ్ నాకు ఇచ్చారు. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను. కంటెంట్‌ బాగుంటే సినిమా ఆడుతుంది అని నమ్మి మా ప్రొడ్యూసర్‌ రవికిరణ్‌గారు ఈ సినిమాని నిర్మించారు. ఆయన నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌. ఇంత మంచి సినిమాని నాతో చేసిన రవికిరణ్‌గారికి థాంక్స్‌. ఆయన ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి. హీరోగా నన్ను బాగా ఎంకరేజ్‌ చేసి నాతో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమా సక్సెస్‌తో పెద్ద పెద్ద డైరెక్టర్స్‌ నుండి ఆఫర్స్‌ వస్తున్నాయి అని సప్తగిరి అన్నారు.

   రైతులు బ్రతకాలి అనే సందేశంతో

  రైతులు బ్రతకాలి అనే సందేశంతో

  పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మాదిరిగా ఇక్కడ మన సమాజాన్ని కాపాడాలి. రాజకీయ నాయకులు చట్టం, న్యాయం మనల్ని కాపాడే దానవులు. వీళ్ల ముగ్గురు సరిగా పనిచేయకపోతే ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కాలి. రైతులు బ్రతకాలి అనే చక్కని మెసేజ్‌తో సినిమా చేశారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేశారు అని అన్నారు.

   అత్యద్భుతంగా సాయికుమార్‌

  అత్యద్భుతంగా సాయికుమార్‌

  సాయికుమార్‌, శివప్రసాద్‌గారు అత్యద్భుతంగా చేశారు. వారికి ధీటుగా సప్తగిరి నటించాడు. గొల్లపూడి మారుతీరావుగారు కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి, ఎల్‌.బి.శ్రీరామ్‌ ఎంతో మంది ఆర్టిస్ట్‌ల్ని పెట్టి పాత్రలు చిన్నవి అయినా సినిమా తీసిన నిర్మాత రవికిరణ్‌కి నా హ్యాట్సాఫ్‌. ఈ సినిమాతో మా చరణ్‌ దర్శకుడిగా సక్సెస్‌ అయినందుకు నాకు చాలా ఆనందంగా వుంది అని పరుచూరి అన్నారు.

   సప్తగిరిలో ఫుల్‌ ఎనర్జీ వుంది!!

  సప్తగిరిలో ఫుల్‌ ఎనర్జీ వుంది!!

  పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''సప్తగిరి, రవికిరణ్‌ ఇద్దరూ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో సూపర్‌హిట్‌ కొట్టారు. మళ్లీ వారి కాంబినేషన్‌లో 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' సక్సెస్‌ అయ్యింది. నిర్మాత రవికిరణ్‌గారికి సినిమాల పట్ల మంచి అవగాహన వుంది. అలాగే మంచి లక్‌ కూడా వుంది. కథల పట్ల మంచి టేస్ట్‌ వుంది. అందుకే రెండు సూపర్‌హిట్‌ సినిమాలు తియ్యగలిగాడు. సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి ముగ్గురూ పోటాపోటీగా ఈ చిత్రంలో నటించారు. సప్తగిరి పోరాటంతో న్యాయాన్ని గెలిపించాడు. అతనిలో ఒక ఎనర్జీ వుంది అని అన్నారు.

   పూర్తిస్థాయి నటుడిగా సప్తగిరి

  పూర్తిస్థాయి నటుడిగా సప్తగిరి

  సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రంతో ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ ఆర్టిస్ట్‌గా నిరూపించుకున్నాడు. అతనికి ఇంకా మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను. మా శిష్యుడు చరణ్‌ ఎప్పట్నుంచో మాతో ట్రావెల్‌ అవుతున్నాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసి తానేంటో నిరూపించుకున్నాడు. మంచి హిట్‌ సినిమా తీసినందుకు చరణ్‌ని అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని అఖండ విజయం చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.

   సినిమా అద్భుతంగా

  సినిమా అద్భుతంగా

  దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - ''రిలీజ్‌ రోజు మెయిన్‌ థియేటర్‌ సంధ్యలో ఆడియన్స్‌ మధ్య ఈ సినిమా చూశాను. సినిమా స్టార్టింగ్‌ నుండి ప్రేక్షకులు విజిల్స్‌, క్లాప్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా అద్భుతంగా వుంది. చాలా బాగా చేశారు అని ప్రేక్షకులు అభినందించారు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్‌, వెల్‌ విషర్స్‌ ఫోన్‌ చేసి చాలా మంచి సినిమా తీశావ్‌. చాలా బాగుంది పెద్ద డైరెక్టర్‌లా తీశావ్‌ అని అప్రిషియేట్‌ చేస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావించాను అని అన్నారు.

   కంటెంట్‌ని నమ్ముకుంటే

  కంటెంట్‌ని నమ్ముకుంటే

  చిత్ర నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసి నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఒక కంటెంట్‌, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాకి ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా ఎంత సపోర్ట్‌ చేస్తుంది అనడానికి ఈ సినిమా నిదర్శనం. విలేజ్‌లో, సిటీలో ఈ సినిమా ఆడియన్స్‌ మధ్య చూశాను. ఎక్స్‌లెంట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రైతులు, లాయర్లు ఎంతోమంది ఈ సినిమా చూసి మంచి సినిమా తీశారు అని అప్రిషియేట్‌ చేస్తున్నారు అని అన్నారు.

   సప్తగిరి ఎల్‌ఎల్‌బి సూపర్ హిట్

  సప్తగిరి ఎల్‌ఎల్‌బి సూపర్ హిట్

  బి.ఎ.రాజుగారు మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' సక్సెస్‌ అయ్యింది. సూపర్‌హిట్‌కి వెళ్ళబోతోంది. ఈ క్రెడిట్‌ అంతా ప్రేక్షకులతో పాటు మీడియాకి చెందుతుంది. ఒక మంచి సినిమా తీస్తే దానికి మావంతు సహకారం అందిస్తామని ఈ సినిమాతో ప్రూవ్‌ చేశారు. ఈ చిత్రంలో సప్తగిరి విశ్వరూపం చూపించాడు. సాయికుమార్‌ పక్కన యాక్ట్‌ చేయడం మామూలు విషయం కాదు. ఒక సింహంతో ఢీకొన్నట్లే. ప్రతి ఒక్కరూ సప్తగిరిలో ఇంత టాలెంట్‌ వుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్వెల్‌ సీన్స్‌లో బైక్‌ మీద చేతులు వదిలేసి వెళ్లే సీన్‌కి ఆడియన్స్‌ ఎంత విజిల్స్‌ కొట్టారో.. క్లైమాక్స్‌లో సాయికుమార్‌గారిని ఢీకొట్టే సన్నివేశానికి అంతే క్లాప్స్‌ పడుతున్నాయి. ఈ సినిమాతో ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా సప్తగిరి ఎంతో ఎదిగాడు. చరణ్‌లో మంచి డైరెక్టర్‌ వున్నాడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు అని అన్నారు.

   మంచి రెస్పాన్స్‌

  మంచి రెస్పాన్స్‌

  హీరోయిన్‌ కౌశిష్‌ వోరా మాట్లాడుతూ - ''థియేటర్‌లో సినిమా చూశాను. ఆడియన్స్‌ అందరూ సినిమాని బాగా రిసీవ్‌ చేసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ టీమ్‌తో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ప్రతి ఒక్కరూ హార్డ్‌వర్క్‌ చేశారు. సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా సంతృప్తిగా వుంది. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

  English summary
  Comedian cum Hero Saptagiri's latest movie is Saptagiri LLB. This movie has got positive note from the media and Viwers. This movie god success report. In this occassion, Film Unit celebrated success meet in Prasad Labs of Hyderabad. Saptagiri, Parchuri brothers, Producer Ravi Kiran, Heroine Kashish Vohra are attended for the meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X