twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో నేనే, వారి ముందు కెమెడియన్‌లా కనిపించా, అంతకు మించిన హిట్ కొడతా : సప్తగిరి

    సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎల్ఎల్‌బి చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమాతో మరో హిట్ కొడతానని సప్తగిరి అన్నారు. హిందీలో హిట్టయిన జాలీ ఎల్ఎల్‌బి చిత్రానికి ఇది రీమేక్.

    By Bojja Kumar
    |

    'సప్తగిరి ఎక్స్ ప్రెస్' తర్వాత కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బేనర్లో డా. రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన మరో చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' చిత్రానికి ఇది రీమేక్.

    ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ... 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' రైట్స్ ఎక్కడో కొండమీద ఉన్నా నా కోసం నిర్మాత రవి కిరణ్ గారు కొన్నారు, నాపై నమ్మకంతో రెండో సినిమా కూడా నాతోనే చేస్తున్నందుకు థాంక్స్' అన్నారు.

    హీరో నేనే.. కానీ, వారి ముందు కమెడియన్‌లా

    హీరో నేనే.. కానీ, వారి ముందు కమెడియన్‌లా

    ఈ సినిమాలో సాయి కుమార్ గారు హిందీలో బోమన్ ఇరానీ చేసిన క్యారెక్టర్ చేశారు. లాస్ట్ 45 నిమిషాలు తలతిప్పుకోకుండా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా రీరికార్డింగ్ చూసిన తర్వాత నాకో విషయం అర్థమయంది. ఈ సినిమాలో నేనే హీరో అయినా.... సాయి కుమార్ గారు, ఎంపీ శివ ప్రసాద్ గారు హీరోలుగా నటించిన సినిమాలో సప్తగిరి ఓ కమెడియన్ గా చేసినట్లు అనిపించింది. అంత గొప్పగా వారు యాక్ట్ చేశారు. మీ సపోర్టు లేకుండా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.... అని సప్తగిరి వ్యాఖ్యానించారు.

    అంతకు మించిన హిట్ కొడతా

    అంతకు మించిన హిట్ కొడతా

    ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. అన్నీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అంతకు మించిన హిట్ కొడతానని నమ్మకంగా చెబుతున్నాను.... అని సప్తగిరి వ్యాఖ్యానించారు.

    దర్శకుడిగా చరణ్ లక్కాకుల

    దర్శకుడిగా చరణ్ లక్కాకుల

    చరణ్‌ లక్కాకుల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చరణ్ లక్కాకుల 'కలిసుందాం..రా', 'ప్రేయసిరావే', 'నిన్నే ప్రేమిస్తా', 'భీమిలి కబడ్డీ జట్టు' 'రచ్చ', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం శాఖలో పని చేశారు.

    తెర వెనక

    ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

    English summary
    Watch and Enjoy Saptagiri LLB Teaser ft. Saptagiri, Kashish Vora Directed by Charan Lakkakula Produced by Dr. K. Ravi Kirane.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X