»   »  సప్తగిరీ..ఏది నిజం? ఏంటీ ట్విస్ట్?

సప్తగిరీ..ఏది నిజం? ఏంటీ ట్విస్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమిడియన్ సప్తగిరి హీరోగా సీనియర్‌ దర్శకుడు సాగర్‌ దర్శకత్వంలో ఆయన శిష్యుడు ఏ.ఎస్‌.రవికుమార్‌చౌదరి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రుగ్వేద డ్రీమ్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటిదేం లేదని కమిడియన్ సప్తగిరి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

Friends,Today, I've seen a news, that i'm gonna act as Hero. I'm NOT DOING ANY MOVIE AS HERO. I'm very happy...

Posted by Sapthagiri on 16 January 2016

మరో ప్రక్క... దర్శకుడు సాగర్‌ మాట్లాడుతూ,'చాలా మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాను. ఈ సినిమా రూపకల్పనలో నా శిష్యులైన దర్శకులు శ్రీనువైట్ల, వి.వి.వినాయక్‌, ఏ.ఎస్‌.రవికుమార్‌చౌదరి, నాగేశ్వరరెడ్డి నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. శిష్యుల సహకారంతో ఓ గురువు సినిమా చేయడాన్ని గొప్ప విషయంగా భావిస్తున్నాను' అని చెప్పారు.

 Saptagiri not turning as a hero

'మమ్మల్ని ఇండిస్టీలో పెంచి, పోషించి ఈ స్థాయికి రావడానికి కారకులైన మా గురువుగారికి శిష్యులందరం చేస్తున్న సత్కారంలాంటిది ఈ చిత్రం' అని నిర్మాత ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి చెప్పారు.

అయితే అలాంటిదేం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని, హాస్య నటుడుగా ఇలాగే తాను ఎంటర్టైన్ చేయటం తనకు చాలా ఆనందంగా ఉందని, ఎప్పిటిలాగే తాను కంటిన్యూ అవుతానని, ఎప్పటిలాగే సపోర్ట్ ఇవ్వమని సప్తగిరి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారని రాసుకొచ్చారు. ఇంతకీ సప్తగిరీ ఏమిటీ ట్విస్ట్ లు..ఏమిటీ పంచ్ లు... అంటున్నారు అబిమానులు.

తన నటన, పంచ్‌డైలాగ్‌లతో ప్రేక్షకులను కవ్వించే నటుడు సప్తగిరి..రీసెంట్ గా వచ్చిన ఎక్సప్రెస్ రాజా లో కీలకమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర సినిమా మొత్తం సాగి నవ్వించింది.

Read more about: saptagiri
English summary
Sapthagiri shared in fb:"Friends,Today, I've seen a news, that i'm gonna act as Hero. I'm NOT DOING ANY MOVIE AS HERO. I'm very happy entertaining you as a comedian. I'll continue doing the same with all of your support and blessings.BLESS ME. Love you All. "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu