»   » ఈ వారం నాలుగు సినిమాలు విడులవుతున్నాయి, ఇదిగో వివరాలు...

ఈ వారం నాలుగు సినిమాలు విడులవుతున్నాయి, ఇదిగో వివరాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఈ వీక్ టాలీవుడ్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే !

డిసెంబర్ మూడోవారం క్రిస్ మస్ సీజన్, జనవరిలో సంక్రాంతి సీజన్ ఉండటంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో డిసెంబర్ మొదటి వారంలో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి.

మొదటి వారంలో 'సప్తగిరి', 'మళ్లీ రావే', 'బిటెక్ బాబులు', 'ఆకలి పోరాటం', 'ఇది మా ప్రేమకథ', రెండో వారంలో 'జులియట్ లవర్ ఆఫ్ ఇడియట్' సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

సప్తగిరి ఎల్ ఎల్ బి

సప్తగిరి ఎల్ ఎల్ బి

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. దర్శకుడు చరణ్‌ లక్కాకుల. బుల్గానిన్‌ సంగీతం అందించారు.

మళ్లీ రావా

మళ్లీ రావా

స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది.

ఆకలి పోరాటం

ఆకలి పోరాటం

గంగాధర్, రేణుక, హరీష్ వినయ్, హారిక హీరో, హీరోయిన్ లుగా రామ్ సాయి గోకులం క్రియేషన్స్ వారు ఆనంద్ సాగర్ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం ‘ఆకలి పోరాటం' డిసెంబర్ 8న రిలీజ్ కి సిద్దమవుతుంది.

ఇది మా ప్రేమకథ

ఇది మా ప్రేమకథ

బుల్లితెరపై ఫేమస్ అయిన యాంకర్ రవి త్వరలో 'ఇది మా ప్రేమ కథ' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో మేఘనా లోకేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం విడుదలవుతోంది.

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్

నవీన్ చంద్ర నివేథ థామస్ జంటగా నటిస్తున్న సినిమా జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రఘు బాబు చౌదరి మరియు కే.బి చౌదరి లు సంయుక్తంగా నిర్మిస్తుండగా సుకుమార్ దగ్గర పలు సినిమాలు అసోసియేట్ గా పని చేసిన అజయ్ వోదిరాల దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఏత్తున విడుదలకు సిద్దంగా ఉంది.

English summary
Tollywood movies Sapthagiri LLB, Malli Raava, Aakali Poratam, Idhi Maa Prema Katha releasing on Dec 8.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu