పవన్ కళ్యాణ్‌పై సప్తగిరి కామెంట్స్: ఎవరూ ఊహించలేదు.... (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌స‌. విజ‌య్ బుల్‌గానిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో కార్య‌క్ర‌మానికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రై బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని సప్తగిరి అందుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో సప్తగిరి.... పవన్ కళ్యాణ్ గురించి భావోద్వేగంగా స్పందించారు. ఇంత మంది మెగా అభిమానుల మధ్య, ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో.... నా జీవితంలో నేను ఊహించలేదు అన్నా(మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి).... కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. ఆపుకుంటున్నాను అంటూ సప్తగిరి భావోద్వేగానికి గురయ్యాడు

నాజీవితంలో ఎందుకింత మంచి రోజు జరిగింది అంటే... పుట్టినప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవిని చూస్తూ పెరిగాను. ఆయన్ను అభిమానిస్తూ పెరిగాను. ఆయన్ను ఆరాధిస్తూ పెరిగాను. నా మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారితో లక్షసార్లు మాట్లాడాను. నేను ఇంత నిజాయితీ పరుడైన మెగా అభిమానిని కాబట్టే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్ కు వచ్చారు అని సప్తగిరి చెప్పుకొచ్చారు.

సార్... నేను మీకు మాటల్లో చెప్పుకోలేంత రుణపడిపోయాను సార్. మీరు అక్కడ కూర్చుని చిన్నపిల్లాడిలా నవ్వుతుంటే.... నా మనసు మొత్తం పవర్ స్టార్ ఆవహించేసాడు. ఆయన సినిమాల్లో ఓ కుర్రాడిలా కనిపిస్తాడు. సడెన్ గా ఎవరికో హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి వైట్ అండ్ వైట్ తో మర్యాదస్తుడైన యోగిలా కనపడతాడు. రాజకీయ వేదికపై చూస్తే...చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తులు... మనం అన్నీ బుక్కుల్లో చదవడమేనండి. నేనెవ్వరినీ చూడలేదు చరిత్ర సృష్టించిన వ్యక్తులు ఎలా ఉంటారో. ఈ రోజు భవిష్యత్తులో ఎన్నో గొప్ప సంచలనాలను, ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే, ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి ఈ రోజు మన వెనక నిలబడ్డాడు. నిజంగా నా మనసు మొత్తం పవర్ స్టార్ గారు ఆవహించి ఉన్నారు సప్తగిరి.

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సార్ మీకు మళ్లీ ఒకసారి థాంక్స్ చెబుతున్నాను. ఇంత చిన్న సినిమాను.. నాకు కొన్ని కోట్ల రూపాయల వ్యాల్యూ చేసే అభిమానాన్ని ఈ సినిమాకు మీరు పంచారు. మనస్తూర్తిగా మరొక్కసారి మీరు పాదాభివందం చేస్తున్నాను అని సప్తగిరి చెప్పుకొచ్చారు.

చొక్కాలు చించుకున్నా, పవర్ స్టార్ అని అరిచా

మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ... అన్నా, మీలో ఒకడిని అన్నా.. ఇక్కడికొచ్చానన్నా...అక్కడ మీ స్థానంలో ఉండి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచింది నేనే అన్నా... ఇప్పుడు మీరక్కడ ఉన్నారు, అదృష్టం బావుండి నేను ఇక్కడ ఉన్నాను. చొక్కాలు చింపుకుని థియేటర్లలో తిరిగిన రోజులు ఉన్నాయన్నా. మనసంతా భావోద్వేగంతో నిండిపోయి ఉంది. ఆయన ఎనర్జీ మమ్మల్ని నడిపిస్తుంది అన్నారు.

ఎంతదూరం అయినా వస్తాను సార్

సార్ ఈ రోజు చెబుతున్నా సార్.. మీ కోసం ఎంత దూరం నడవటానికైనా సిద్ధం. ఎక్కడికి రావడానికైనా సిద్ధం. మీ పిలుపు కోసం ఈ అభిమాని వెయిట్ చేస్తున్నాడు సార్. దేని కైనా సిద్ధం...ఐ లవ్ యూ ఐలవ్ యూ ఐ లవ్ యూ..... అంటూ సప్తగిరి తన ప్రసంగం ముగించారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్)

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్)

త్రివిక్రమ్ అనగానే కొద్దిపాటి వ్యంగ్యం తో కూడిన సునిశితమైన హాస్యం, జీవిత సత్యాలతో కూడిన పంచ్‌ల మెరుపులు, జీవిత తాత్వికత, మార్మికత కలి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సప్తగిరి కోసం పవన్ రావడంపై రూమర్స్...

సప్తగిరి కోసం పవన్ రావడంపై రూమర్స్...

రామ్ చరణ్ మూవీ ‘ధృవ' ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆడియో ఫంక్షనే రద్దయింది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకకు పవన్ వస్తుండటంతో హర్టియన రామ్ చరణ్ ధృవ ఆడియో వేడుక రద్దు చేసాడట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుతో విసిగిపోయి వీర్యదాత!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుతో విసిగిపోయి వీర్యదాత!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో అతి చేయడం అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో ఫంక్షన్ అయినా వీరు రావడం... అక్కడ పవర్ స్టార్ అంటూ అరవడం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X