»   » కూతురు బికినీ ఫోటో వైరల్, డిలీట్ చేయించిన స్టార్ హీరో!

కూతురు బికినీ ఫోటో వైరల్, డిలీట్ చేయించిన స్టార్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ త్వరలో బాలీవుడ్ తెరంగ్రేటం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించాలనే కసితో ఉన్న సారా.... బరువు తగ్గి స్లిమ్ గా, సెక్సీగా తయారైంది.

ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ కు సంబంధించిన బికినీ ఫోటో ఒకటి వైరల్ అయింది. అయితే ఈ ఫోటో ఉన్నట్టుండి సోషల్ మీడియా నుండి మాయం కావడంతో సారా తండ్రి సైఫ్ ఈ పని చేయించాడనే ప్రచారం మొదలైంది.

సారా బికినీ పిక్చర్

సారా బికినీ పిక్చర్

సారా అలీ ఖాన్ ఇటీవలే ముంబైలోని ఓ హోటల్ లో టీవీ ప్రొడ్యూసర్ వికాస్ గుప్తతో కలిసి కనిపించింది. స్విమ్మింగ్ చేసిన అనంతరం వికాస్ తో కలిసి బికినీలో ఫోటోకు ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోను వికాస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసాడు.

డిలీట్ చేసారు

డిలీట్ చేసారు

వికాస్ ఈ ఫోటోను షేర్ చేస్తూ... వీకెండ్ ఎట్ మారియట్. మీటింగ్ ఓల్డ్ ఫ్రెండ్. సూపర్ టైమ్. స్విమ్మింగ్, మీటింగ్ అనే యాష్ ట్యాగ్ తో ఫోటోను షేర్ చేసాడు. అయితే ఈ ఫోటో పోస్టయిన కొన్ని గంటల్లోనే దాన్ని డిలీట్ చేసాడు.

సైఫ్ ప్రొటెక్టివ్ డాడ్

సైఫ్ ప్రొటెక్టివ్ డాడ్

అయితే ఈ ఫోటో వైరల్ అయితే సారా మీద ఏవేవో వార్తలు ప్రచారంలోకి వస్తాయని భావించిన సైఫ్.... కావాలనే ఈ ఫోటోను డిలీట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.

సారా బాలీవుడ్ ఎంట్రీ గురించి

సారా బాలీవుడ్ ఎంట్రీ గురించి

సారా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని, ఈ రంగంలోకి రావాలని సారా నిర్ణయించుకుంది. సారా ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. ఈ రంగంలోకి వచ్చే ముందు ఇక్కడి పరిస్థితుల గురించి వివరించాను అని ఇటీవల సైఫ్ తెలిపారు.

English summary
Saif Ali Khan's daughter Sara is yet to make debut in Bollywood but the pretty lady has got herself in a soup with all the controversies surfacing social media recently. We recently came across this bikini picture of Sara going viral on the internet!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu