డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్?.. రియా చక్రవర్తి నోట 25 పేర్లు బయటకు అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్ కాగా, డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్లు సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమోన్ ఖంబట్టా పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో హిందీ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాదిలో కూడా కలకలం రేపింది. తాజాా వివాదానికి సంబంధించిన పూర్తి విషయాల్లోకి వెళితే..

Recommended Video

Rhea Chakraborty : Rakul Preet Singh,Sara Ali Khan డ్రగ్స్ తీసుకున్నారని NCB కి వెల్లడించిన రియా!
రియా చక్రవర్తి కాల్‌డేటాలో రకుల్ ప్రీత్ పేరు

రియా చక్రవర్తి కాల్‌డేటాలో రకుల్ ప్రీత్ పేరు

గత కొద్దికాలంగా సాగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో బయటపడిన రియా చక్రవర్తి కాల్ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి పేర్లతోపాటు ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే అప్పట్లో కాల్ డేటాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ బ్రేకింగ్ చేసిన వార్తలో రకుల్ ప్రీత్ పేరు ప్రధానంగా వినిపించడం మీడియాలో చర్చనీయాంశమైంది.

రియా నోట 25 మంది బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేరు

రియా నోట 25 మంది బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేరు

డ్రగ్స్ కేసులో అరెస్టై 14 రోజుల కస్టడీలో ఉన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జరిపిన ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది బాలీవుడ్ పేర్లు బయటకు వచ్చాయనే విషయం గత మూడు, నాలుగు రోజులుగా సాగుతున్నది. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న వారిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయం సంచలనంగా మారింది.

టౌమ్స్ నౌ కథనంలో ముగ్గురి పేర్లు రావడం

టౌమ్స్ నౌ కథనంలో ముగ్గురి పేర్లు రావడం

డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ అధికారులు వెల్లడించిన సమాచారం అంటూ జాతీయ టెలివిజన్ ఛానెల్ టైమ్స్ నౌ ముగ్గురి పేర్లను బయటపెట్టడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. టైమ్స్ నౌ బయటపెట్టిన వారిలో సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సైమోన్ ఖంబట్టా ఉండటం గమనార్హం.

ఈడీకి లభించిన వాట్సప్ చాట్‌లో

ఈడీకి లభించిన వాట్సప్ చాట్‌లో

ఎన్సీబీ అధికారులు విచారణలో రియా చక్రవర్తి సారా, రకుల్, సైమోన్ పేర్లను బయటపెట్టిందని టైమ్స్ నౌ కథనంలో పేర్కొన్నది. రియా, సారాకు, అలాగే రియా, రకుల్‌కు మధ్య మంచి స్నేహం ఉందనే విషయాం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల ఈడీకి లభించిన వాట్సప్‌ ఛాట్‌లో సారా సుల్తాన్ అనే పేరు కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రకుల్ ప్రీత్ స్పందన

రకుల్ ప్రీత్ స్పందన

జాతీయ టెలివిజన్ ఛానెల్ సెప్టెంబర్ 11వ తేదీన ప్రసారం చేసిన కథనంపై రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై రకుల్ ఇచ్చే వివరణ కోసం మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఈ వార్తను ఖండిస్తారా? లేదా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X