twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామానాయుడు గారితో నటి శారద జ్ఞాపకాలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామానాయుడు... తెలుగు సినిమా పరిశ్రమలో నిలువెత్తు మూర్తిత్వానికీ, క్రమశిక్షణకు, సినిమా నిర్మాణానికి ఒక నిలువెత్తు సంతకం. ఆయన స్థాపించిన 'సురేష్‌ ప్రొడక్షన్స్‌' ఇంతింతై వటుడింతై అంటూ ఎదిగి ఎన్నో అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది. రామానాయుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు రామానాయుడు మరణవార్త విని తట్టుకోలేకపోయారు. మీడియా వారిని పలకరించినప్పుడు ఎన్నో పాత జ్ఞాపాలు, మధుర స్మృతులు వారి కళ్లలో సుడులు తిరిగాయి. ఆయన్ని గుర్తు చేసుకుంటూ శారద ఇలా స్పందించారు.

    శారద మాట్లాడుతూ...

    ప్రయోగాలకు పెద్ద పీట వేసే నిర్మాత ఎవరంటే నాయుడుగారి పేరే ముందు చెబుతాను. ఎందుకంటే ఆయన రూపొందించిన సినిమాలన్నీ అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్లుగానే మిగిలాయి. 'ప్రతిధ్వని'లో నా చేత పోలీసు అధికారి వేషం వేయించారు. పోలీసు ప్యాంటు, చొక్కాలతో ఉన్న నన్ను చూసి చాలా మంది 'నాయుడుగారు ఇలా వర్కవుట్‌ అవుతుందా?.. ఈ అమ్మాయిని జనం చూస్తారా?' అని రామానాయుడిని అడిగారు.

    Sarada about D. Ramanaidu

    'చూస్తారా కాదు... హిట్‌ చేస్తారు కూడా' అని నాయుడుగారు సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆ సినిమా పెద్ద హిట్‌. ఒక సినిమాపైన, దాని కథా బలంపైన ఆయనకున్న నమ్మకం అలాంటిది. ఒక సినిమా ప్రారంభమైందంటే పూర్తయ్యేంత వరకూ నిద్రపోరు. సెట్స్‌లో ఆయన ఒక నిర్మాతగా మనకు కనిపించరు. అన్ని పనులూ చేస్తారు. అలాంటి మంచి మనిషి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన గుండెల్లో నిత్యం జీవించే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అన్నారు.

    కమల్ హాసన్ మాట్లాడుతూ...

    రామానాయుడిని తెలుగు నిర్మాత అంటే నేను అంగీకరించలేను. ఆయన జాతీయ నిర్మాత. అప్పట్లో నాకు తెలిసీ ఏ నిర్మాత కూడా దేశంలోని పలు భాషల్లో సినిమాలు నిర్మించినవారు లేరు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఈ దిశగా సినిమాలు రూపొందిస్తున్నా అప్పట్లో మాత్రం నాయుడుగారే. ఒక నిర్మాత అంటే సినిమామీద డబ్బులు ఖర్చు చేసి, చివరల్లో ఇంటికి కొంత లాభం మూట కట్టుకుపోయేవాడని అనుకుంటుంటాం. కానీ నిర్మాత అంటే ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి. సినిమా స్క్రిప్ట్‌లో ఆయనకు ప్రతి లైనూ, డైలాగూ కంఠోపాఠం.

    నన్ను 'హీరో'గారు అని ఆత్మీయంగా పిలిచేవారు. 'ఇంద్రుడు చంద్రుడు' సినిమా తీస్తున్నప్పుడు 'ఏం హీరో గారూ ఫలానా సీన్‌ అయిపోయిందా, ఆ డైలాగ్‌ బాగా వచ్చిందా' అంటూ అడిగేవారు. ఆయనకు అంత అనుభవం ఎలా వచ్చిందీ అంటే బహుశా ఆయన ప్రారంభంలో పనిచేసిన పెద్దపెద్ద సంస్థలు విజయా వాహినీల నుంచే అనుకుంటాను. ఆయనో లెజెండ్‌. ఆయన కుటుంబంతో నాకు అత్యంత ఆత్మీయానుబంధం ఉంది. వారి అబ్బాయిలతో కలిసి పనిచేశాను. ఆయన ఎంతోమందికి ఒక హీరో లాంటివారు అన్నారు కమల్.

    English summary
    Sarada has expressed her deep condolences for the death of Veteran producer Dr D Ramanaidu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X