శారదకు 'చిత్తూరు నాగయ్య' పురస్కారం
ప్రముఖ నటి శారదకు 'పద్మశ్రీ' చిత్తూరు వి.నాగయ్య పురస్కార ప్రదానం జరిగింది. శనివారం రాత్రి ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడుతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిభావంతులైన సీనియర్ సినీ ప్రముఖులు ఒకరికి ఈ అవార్డు బహూకరిస్తున్నారు.
ఈ ఏడాదికి ఈ పురస్కారాన్ని శారదకు ప్రదానం చేశారు. టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సీనియర్ నటీమణి అంజలీదేవి శారదను ఘనంగా సన్మానించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలనాటి నటీమణులు రాజసులోచన, గీతాంజలి, ప్రభ, వై.విజయ, సచ్చు, ప్రముఖ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, మురారి, గాయనీమణులు పి.సుశీల, జానకి తదితరులు పాల్గొన్నారు
శారద పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఆదికేశవుల నాయుడు టీటీడి అంజలీదేవి పి సుశీల జానకి గీతాంజలి ప్రభ sarada chittoor nagaiah adikesavulu naidu p susheela janaki


Click it and Unblock the Notifications