వరుణ్ సందేశ్ ‘సరదాగా అమ్మాయితో’ జూన్ 14న
హైదరాబాద్ : శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నిర్మించిన 'సరదాగా అమ్మాయితో' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పి. భానుశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పత్తికొండ కుమారస్వామి నిర్మించారు.
ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించాడని, పాటలు, చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాత కుమారస్వామి తెలిపారు. నిర్మాత బడ్జెట్ గురించి ఆలోచించక ఈ కథ చెప్పినప్పుడు దర్శకుడిగా అవకాశమిచ్చారని, హీరోహీరోయిన్లిద్దరూ చక్కగా పనిచేయడంతో తర్వాత చిత్రం కూడా వాళ్లతో చేయాలనిపించిందని, సినిమా హిట్ అయి అందరికీ మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నానని చిత్ర దర్శకుడు భానుశంకర్ తెలిపారు.
ఈ చిత్రాన్ని వరుణ్ సందేశ్ ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రూపొందించడం విశేషం. మరి నిర్మాతలు ఏ మేరకు గట్టెక్కుతారో చూడాలి. కె.విశ్వనాథ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ, రావు రమేష్, కృష్ణ్భగవాన్, రాజేశ్వరి నాయర్, సురేఖవాణి, మాస్టర్ నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: పత్తికొండ రాజ్యలక్ష్మి, పాటలు: సాహితి, చంద్రబోస్, సురేంద్ర కృష్ణ, శ్రీమణి, శ్రీవల్లి, శ్రీనివాస్ ముక్కామల, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: సాయిశ్రీనివాస్, సంగీతం: రవివర్మ, నిర్మాత: పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం: భానుశంకర్ పి.


Click it and Unblock the Notifications











