ప్రణీత్ మీడియా ద్వారా యు.యస్.ఎ లో 'సరదాగ కాసేపు'..!
'సరదాగ కాసేపు' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియా సోంతం చేసుకోని త్వరలో ఈ సినిమాను సెప్టెంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రామన్ సంచుల తెలియజేశారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మాతగా నిర్మించినటు 'సరదాగకాసేపు' సినిమాని ఇటీవలే వైభవంగా ఆడియో విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్, హీరోయిన్ గా మధురిమ నటించారు. ఇంకోక హీరోగా అవసరాల శ్రీనివాస్(అష్టాచమ్మా ఫేం) నటించారు. ఈ సినిమాకి స్వర మాంత్రికుడు చక్రి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
'సరదాగకాసేపు' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియాకి ఇచ్చినటువంటి సురేషే ప్రోడక్షన్ మాజీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ కు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇక ఈ సినిమా ఎవరైన ఎగ్జిబిట్ చేయాలనుకుంటే వారు ఈ క్రింది నెంబర్ ను కాంటాక్ట్ చేయవసిందిగా కోరారు.
Raman Sanchula
(408) 464-4788
[email protected]


Click it and Unblock the Notifications











