యాభై దాటిన హీరోపై పవన్ హీరోయిన్ క్రష్
ముంబై: పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రంలో నటించిన సారా జేన్ డయాస్ గుర్తుండే ఉంటుంది. చిత్రం హిట్ కాకపోయినా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె తాజాగా... ఓ ఇంటర్వూలో.. యాభై సంవత్సరాలు దాటిన హీరోపై తన క్రష్ ని వివరించింది. ఆమె మాట్లాడుతూ... తనకు హాలీవుడ్ హీరో జార్జి క్లూనీ అంటే క్రషన్, తనకు ఆ హీరో అంటే ఫాంటసీస్ ఉన్నాయని చెప్పుకొచ్చాయింది. తాను, ఆ హీరో కలిసి ఓ ఎలివేటర్ లో ఇరుక్కుని, ఆ మిషన్ స్టక్ అయితే బావుంటుందని చెప్పుకొచ్చింది.
సారా జేన్ డయాస్ చదివింది మస్కట్ లో అయినా పెరిగిందంతా ముంబాయ్. ఆమె తొలిసారిగా తమిళంలో తొలిసారిగా 'తీర్ధ విలయాట్టు పిళ్లై' (తెలుగులో కిలాడి) చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ సుందరి వి చానల్ ద్వారా సుపరిచితురాలు. 2007లో మిస్ వరల్డ్ పోటీలో కూడా పాల్గొంది. గత సంవత్సరం అభిషేక్‌బచ్చన్‌తో కలిసి 'గేవ్గు' చిత్రంలో నటించింది. అరుుతే తెలుగులో ఆమె నటించిన 'పంజా' నిరాశనే మిగిల్చింది. ఇప్పటిదాకా సరైన హిట్ లేక ఎదురుచూస్తున్న సారాజేన్‌కు అనుకోకుండా బాలీవుడ్గలో ఓ మాంచి హీరోరుున్ ఓరియెంటెడ్గ చిత్రంలో నటించే అవకాశం లభించింది.
ఆమె 1997లో 'మిస్ ఇండియా ఒమన్' టైటిల్‌ను సాధించడంతో సారా కేరీర్ 14వ ఏటనే ప్రారంభమైందని చెప్పుకోవాలి. * సరిగ్గా పది సంవత్సరాల తరువాత, అంటే 2007లో 'ఫెమినా మిస్ ఇండియా' అందాల కిరిటాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తరువాత ఆమెకు సినిమా రంగం నుంచి కూడా ఎన్నో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆమె హిందీలో చేసిన 'క్యా సూపర్ కూల్ హే హమ్' చిత్రం మాత్రం వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











