మెగా హీరోయిన్స్ ఇద్దరూ లెస్బియన్స్ ?
మెగా కౌంపౌడ్ లోంచి వచ్చిన నేహా శర్మ, సారా జేన్ డియాస్ లు త్వరలో లెస్బియన్ గా కనిపించి వెండితెరను వేడిక్కించనున్నారని సమాచారం. తెలుగులో అవకాశాలు సంపాదించుకోలక మిగిలిపోయిన ఈ ముద్దు గుమ్మలు హిందీలో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే చిత్రం చేస్తున్నారు. దర్సకుడు ఆ సీన్స్ ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నామని,వల్గారిటీ కి చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నా అదంటా పబ్లిసిటీ స్టంటే అంటోంది బాలీవుడ్ మీడియా. ఏక్తా కపూర్ సినిమా గతంలో డర్టీ పిక్చర్ తో ఎలా శృంగారం చూపి మార్కెట్ ని ఎలా కబళించిందో అలాగే ఈ సారి కూడా ఈ సెక్స్ కామెడీ తో ఆమె విజృంభించనుందని చెప్పుకుంటున్నారు.
నేహా శర్మ, సారా జేన్ డియాస్ లు ప్రస్తుతం ఓ సెక్స్ కామెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. చిరుత చిత్రంలో రామ్ చరణ్ సరసన నేహా శర్మ పరిచయమైంది. అలాగే సారా జేన్ డియాన్..పవన్ కళ్యాణ్ సరసన పంజా చిత్రంలో చేసింది. అయితే వీళ్లిద్దరూ తెలుగులో ఆ తర్వాత ఆఫర్స్ సంపాదించుకోలేకపోయారు. దాంతో హిందీలో ఇలాగైనా అందరి దృష్టినీ ఆకర్షించి ఆఫర్స్ పట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఏక్తాకపూర్ నిర్మించిన ఈ చిత్రం 'క్యా సూపర్ కూల్ హై హమ్'లో తుషార్‌కపూర్, రితేష్‌దేశ్‌ముఖ్, నేహాశర్మ, సారాజైన్ డయాస్ నటిస్తున్నారు. సచిన్ యార్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు2న విడుదల కానుంది. ఈ సందర్బంగా బాలాజీ మోషన్ పిక్చర్స్ ప్రతినిధి తనూజ్ గార్గ్ మాట్లాడుతూ 'సెక్సీ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్త పంపిణీ హక్కులని 21 కోట్ల 60లక్షల భారీ మొత్తం చెల్లించి నాగ్‌పూర్‌కు చెందిన పంపినీదారుడు సొంతం చేసుకున్నారు. 'క్యా కూల్ హై హమ్'కు సీక్వెల్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని తొలి భాగం కన్నా మరింత ఎంటర్‌టైన్ చేస్తుంది' అన్నారు.
నేహాశర్మ తర్వాత కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన చేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఇక్కడ ఆెకు అవకాశాలు రాలేదు. పంజా పెద్ద డిజాస్టర్ కావటంతో సారాకు సైతం అస్సలు ఎవరికీ గుర్తు లేకుండాపోయింది. ఇక ఈ హిందీ చిత్రం ఓ సెక్స్ కామిడీ. గతంలో వచ్చిన క్యా కూల్ హై హమ్ చిత్రానికి సీక్వెల్. తుషార్ కపూర్,రితీష్ దేశముఖ్ కలిసి నటించిన ఆ చిత్రం మంచి హిట్ ని సాధించింది. ఇక వీళ్లతో చేసిన హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఈ సంవత్సంరం హిట్స్ తో దూసుకుపోతున్నారు.


Click it and Unblock the Notifications










