సారాయి వీర్రాజు కి ప్రేరణ అదా?
అజయ్ హీరోగా చేస్తున్న సారాయి వీర్రాజు చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన పరుత్తి వీరన్ ప్రేరణతో ఈ చిత్రం నేటివిటీకి దగ్గరగా, ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కనుందని సమాచారం. అందిన సమాచారం ప్రకారం హీరో తన ప్రియురాలిని చంపిన వారిపై పగ తీర్చుకునే సన్నివేశాలు హైలెట్ అవుతాయని తెలుస్తోంది. ఇక దర్శకుడు డి.ఎస్.కణ్ణన్ మాట్లాడుతూ "గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. కల్లు తీయడం, సారా కాయడం లాంటి వ్యవహారాల్లో మునిగి తేలే యువకుడు వీర్రాజు. ఆ పనైపోయాక పీకల్దాక తాగుతాడు. అలాంటివాడి జీవితం చుట్టూ తిరుగుతుందీ చిత్రం. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయ" అంటున్నాడు. డి.ఎస్.కణ్ణన్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద పనిచేసారు. ఇఖ ఈ చిత్రంలో అజయ్ సరసన రమ్య, మధులిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. పి.ఆర్.కె.రావు నిర్మాత. తెలుగుతోపాటు తమిళంలోనూ ఒకేసారి ఈ చిత్రం విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











