For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సారంగదరియా పాట నాదే.. నాతోనే పాడిస్తా అన్నారు.. కానీ ఇలా చేస్తారనుకోలేదు: కోమలి ఆవేదన

  |

  జానపద పాటలకు ఈ రోజుల్లో వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. యూ ట్యూబ్ ప్రపంచంలో వందల మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. అయితే ఆ పాటలను కొందరు అదే తరహాలో సినిమాల్లోకి తీసుకురావడం కామన్. అయితే పాటలను మొదట పాడిన వారి దగ్గరి నుంచి అనుమతి తీసుకొని వాడుకుంటే తప్పులేదు. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వాడుకుంటే మోసం చేసినట్లే అవుతుంది. ప్రస్తుతం సారంగదరియా పాటపై కూడా అలాంటి వివాదం మొదలైంది. పదేళ్ల క్రితం ఈ పాటను ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తెచ్చిన కోమలి అభ్యంతరం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

  లవ్ స్టొరీ సినిమాపై భారీ హైప్

  లవ్ స్టొరీ సినిమాపై భారీ హైప్

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ స్టొరీ. ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక విదంగా సినిమాకు వస్తున్న బజ్ చూస్తుంటేనే ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల ఫిదా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని సాయి పల్లవితో చేసిన సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

  20 మిలియన్లకు పైగా వ్యూవ్స్

  20 మిలియన్లకు పైగా వ్యూవ్స్

  గత ఏడాది సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ ఓపెన్ కావడంతో లవ్ స్టొరీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 16న సినిమా విడుదల కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమాలోని సారంగదరియా పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 20 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

  ఈ పాట నాదే

  ఈ పాట నాదే

  అయితే ఈ పాట తనదే అంటూ మీడియా ముందుకు వచ్చింది జానపద గాయని కోమలి. 10 ఏళ్ళ క్రితం ఒక టివి ప్రోగ్రామ్ లో పాడగా అప్పుడు రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ఆ షోకు జడ్జిగా ఉన్నారని అయితే అలాంటి గొప్ప వ్యక్తి ఈ విధంగా చేస్తారని తాను అనుకోలేదని అన్నారు.

   మొదట నన్నే అడిగారు

  మొదట నన్నే అడిగారు

  లవ్ స్టోరీ సినిమాలో సారంగదరియా పాటకు రచయితగా సుద్దాల అశోక్ తేజ పేరు వేసుకున్నారు. ఇక పవన్ సంగీతం అందించగా మంగ్లీ పాటను పాడింది. అయితే మొదట ఈ పాటను తనను పాడమని శేఖర్ కమ్ముల అన్నారని చెప్పిన కోమలి అప్పుడు తనకు ఆరోగ్యం బాగోలేక పాడలేదని, కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పకుండా పాడతనాని చెప్పినట్లు తెలిపింది

  బాధ కలిగించింది..

  బాధ కలిగించింది..

  ఇక అప్పటికే సారంగదరియా పాట ప్రోమో తో పాటు మరికొన్ని రోజులకే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడం బాధ కలిగించినట్లు చెప్పారు. సుద్దాల అశోక్ తేజ గారిని అడిగితే ఈ పాట జనాల్లో నుంచి వచ్చిన పాట గాని నువ్వు క్రియేట్ చేసింది కాదని అన్నట్లు తనతో చెప్పినట్లు కోమలి తెలిపింది. అయితే ఆ పాటను నేను మా అమ్మమ్మ నుంచి నేర్చుకోని షోలో పాడడం జనాలు అందరూ విన్నారని ఇప్పుడు కూడా నేనే పాడాలని అంటున్నారని ఆమె తెలిపింది.

   మరోసారి అవకాశం ఇవ్వాలి

  మరోసారి అవకాశం ఇవ్వాలి

  ఇక ఇప్పుడు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని లేదా పాట విషయంలో సినిమాలో నాకు పేరు అయినా వేయాలని కోమలి మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

  English summary
  Biopics have become a special attraction in recent times. Some are showing facts up close while others are weaving fictional stories with commercial twists. It seems that the South Indian beautiful heroine soundarya biopic is also coming to the silver screen soon. Clarity is also reported on who will play her role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X