కళ్యాణ్ రామ్ కొత్త చిత్రంలో హీరోయిన్ ఆమే!?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమాలో శరణ్య మోహన్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. శరణ్య మోహన్ ఇంతకు ముందు విలేజ్ లో వినాయకుడు చిత్రంలో కామిడీ హీరో కృష్ణుడు సరసన చేసింది. ఇక ఈ కొత్త చిత్రం 'అభిమన్యు' ఫేం మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతోంది.
'జయీభవ' చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ చిత్రం గత కొంత కాలంగా ప్రచారానికి దూరంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్ పెట్టారని సమాచారం. ఇక శరణ్యా మోహన్ ప్రస్తుతం నానితో కలిసి 'భీమిలి కబడ్డి జట్టు', వరుణ్‌సందేశ్‌తో 'హ్యాపీ హ్యాపీగా' చిత్రంలో నటిస్తోంది.
కళ్యాణ్ రామ్ శరణ్యా మోహన్ కృష్ణుడు అభిమన్యు మల్లి జయీభవ హరే రామ హరే కృష్ణ నరేన్ కొండేపాటి kalyan ram saranya mohan krishnudu


Click it and Unblock the Notifications