twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌతమికి కౌంటర్ గా శరత్ కుమార్... తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయ్

    దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి సంఘటన కొత్త మలుపు తీసుకుంటోంది. నటీనటుల మధ్య వార్ కి తెరలేస్తున్నట్టు కనిపిస్తోంది .

    |

    దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి సంఘటన కొత్త మలుపు తీసుకుంటోంది. నటీనటుల మధ్య వార్ కి తెరలేస్తున్నట్టు కనిపిస్తోంది . అపోలో ఆస్పత్రిలో 75 రోజుల పాటు జయలలితకు చికిత్స అందించిన వైనం ఎందుకు గోప్యత పాటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలను ప్రముఖ సినీ నటి గౌతమి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా...! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు ప్రశ్నలను సంధిస్తూ గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను తన బ్లాగ్‌లో పెట్టారు. కమల హసన్‌తో విడిపోతున్నట్లు ఇంతకు ముందు ఆమె తన బ్లాగ్‌లో పోస్టు పెట్టిన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

    జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఎందుకు అన్ని రోజులు గోప్యత పాటించారు? ఏ అధికారంతో ఆమెను కలవకూడదంటూ ఆంక్షలు విధించారు? ఆమె చికిత్సకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇలాంటి ప్రధానమైన అంశాలను గౌతమి తన లేఖలో ప్రస్తావించిన గౌతమి
    ప్రధాని ఈ విషయంపై స్పందించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని , ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేతకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని గౌతమి చెప్పింది.

    Sarath kumar counter letter for gouthami

    తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న కన్నుమూశారు. అయితే ఆమె మరణానికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. దీంతో ఆమెది సహజ మరణం కాదనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నటి గౌతమి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృతి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. గౌతమి బాటలోనే మరో నటుడు, పొలిటీషియన్ శరత్ కుమార్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశాడు. తన అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌ ద్వారా ఈ లేఖ రాశారు. అయితే గౌతమి రాసిన లేఖపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ మొత్తంలో కూడా శరత్‌కుమార్ కేంద్ర ప్రభుత్వం జయలలిత విషయంలో సాధ్యమైనంత చొరవ చూపిందని పేర్కొనడం విశేషం.

    కొందరు నిరాధారపూరిత ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, ప్రధాని విధానాలు, విలువలు వాళ్లు అర్థం చేసుకోలేరని అంటూ తన స్వామిభక్తి తో పాటు తానే వపు ఉండబోతున్నాను అనే విశయం ప్రధానికి చేరేలా చేసినట్టున్నాడు శరత్ కుమార్ . కేంద్రం జయలలిత విషయంలో పూర్తి నిబద్ధతతో వ్యవహరించిందని, త్వరలో ఈ ప్రశ్నలన్నీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే సమాధానంతో పటాపంచలవుతాయని శరత్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

    English summary
    Sarath kumar counter letter for Gautami Tadimalla's Letter about Jayalalithaa's sudden death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X