ఆ హీరో కూతురే ఇప్పుడు హాట్ టాపిక్
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆమె రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి ఫోటో షూట్ లో పాల్గొందని సమాచారం. తమిళ దర్శకుడు రాధా మోహన్ దర్సకత్వంలో రెడీ అవుతున్న గౌరవం చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. బైలింగ్వువల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దాంతో మిగతా హీరోల దృష్టి కూడా ఆమెపై పడింది. యంగ్ హీరోలు ఆమె తమ ప్రక్కన బుక్ చేయమని నిర్మాతలను కోరుతున్నారని చెప్తున్నారు. ఇంకా తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యకుండానే ఈ క్రేజ్ ఏమిటీ అంటే..గతంలో నాగచైతన్య సరసన చేసిన సమంత ఏ రేంజికి వెళ్లిపోయిందో కదా అని గుర్తు చేస్తున్నారు. అలాగే మొన్నటికి మొన్న నాగైచైతన్య సరసన బెజవాడలో చేసిన అమలా పౌల్ కూడా బాగానే బిజీగా ఉంది.
నాగచైతన్యతో చేసిన రాధ కూతురు కార్తిక ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన చేస్తోంది. ఈ నేపధ్యంలో వరలక్ష్మికి ఇక్కడ కెరీర్ బాగుంటుందని చెప్తున్నారు. ఇక గౌరవం సినిమాలో నాగార్జున కూడా నటించనున్నారు. దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య నటించబోయే చిత్రానికి 'యజ్ఞం ', 'వీర భద్ర' ఫేం రవికుమార్ చౌదర్శకత్వం వహించనున్నారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











