నమితతో పెళ్లి, సహజీవనం... నా క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారని శరత్ బాబు ఆవేదన

నటి నమితను తాను పెళ్లాడబోతున్నట్లు వచ్చిన వార్తలను సీనియన్ నటుడు శరత్ బాబు ఖండించారు. తాను నమితను కలిసి 8 ఏళ్లు అయిందని, ఈ వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని శరత్ బాబు అన్నారు.

By Bojja Kumar

సీనియర్ నటుడు శరత్ బాబు గురించి తమిళ మీడియాలో వచ్చిన వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. నటి నమితతో ఆయన ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని, సహజీవనం చేస్తున్నారని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

Recommended Video

Good Bad Ugly Trailer : గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్‌ : శ్రీముఖి హాట్‌హాట్‌గా

60 ఏళ్ల పైగా వయసున్న శరత్ బాబుకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లతో పాటు ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి. అలాంటి వ్యక్తి మళ్లీ నమితతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనే వార్తలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.

స్పందించిన శరత్ బాబు

స్పందించిన శరత్ బాబు

ఈ వార్తలను శరత్ బాబు ఖండిచారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. తాను నమితను కలిసి 8 ఏళ్లు అయింది. అలాంటపు తమ మధ్య ఏదో ఉందని చెప్పడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.

దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు

దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు

ఈ పుకార్లు విని కొందరు తనకు ఫోన్ చేసి, ఈ వయసులో కూడా రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ వార్తలు రాసినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, వాటిని పట్టించుకోనని శరత్ బాబు చెప్పారు.

మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు

మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు

తనకు అసలు మళ్ళీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ముందుగా మీడియాకు చెబుతాని అని తెలిపారు.

నా క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు

నా క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు

నాకు సంబంధం లేకున్నా అనవసర విషయాల్లోకి నన్ను లాగి వార్తలు సృష్టించి తన క్యారెక్టర్ ని దెబ్బ తీస్తున్నారు అంటూ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

శరత్ బాబు

శరత్ బాబు

గతంలో శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను, స్నేహ లతా దీక్షిత్ లను పెళ్లాడారు. ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు. తర్వాత శరత్ బాబు మూడో వివాహం కూడా చేసుకున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురు కాగా... భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు. నా భార్యపేరు మిస్సెస్‌ శరత్‌బాబు అని మాత్రమే చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X