'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' : హీరోయిన్ ఖరారు...సమంత కాదు

By Srikanya

హైదరాబాద్ : అనేక అంచనాలు,ఊహలతో గత కొంత కాలంగా పవన్ తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి హీరోయిన్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే శనివారం ఆ వూహాగానాలకి తెరదించుతూ పవన్‌ సరసన హీరోయిన్ ని ఎంపిక చేసినట్టు నిర్మాత శరత్‌ మరార్‌ ప్రకటించారు. ఎట్టకేలకు పవన్ కుజోడీ ఖరారైంది. పవన్‌ సరసన తొలిసారి కాజల్‌ ఆడిపాడబోతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'గబ్బర్‌సింగ్‌'కి కొనసాగింపుగా రూపొందుతున్న'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో హీరోయిన్ఎవరన్న విషయం గురించి చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట ఈ సినిమా కోసం అనీషా ఆంబ్రోస్‌ను హీరోయిన్ గా ఎంచుకొన్నారు. చివరి నిమిషంలో ఆమెను తప్పించి మరో హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడంపై దృష్టిపెట్టారు.

Sardaar Gabbar Singh’s female lead is Kajal Agarwal

సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్నా ఇంకా హీరోయిన్ ఎంపిక పూర్తవ్వలేదు. దీంతో రోజుకో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చేది. రీసెంట్ గా సమంత ని ఖరారు చేసినట్లు చెప్పుకున్నారు.

చిత్రం విశేషాలకు వెళ్తే...

పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు 'సర్దార్‌' పెట్టి ఫస్ట్ లుక్ వదిలారు.

Sardaar Gabbar Singh’s female lead is Kajal Agarwal

నెలాఖరున మొదలయిన కొత్త షెడ్యూలుతో పవన్‌ కల్యాణ్‌ రంగ ప్రవేశం చేసారు, ఆయనపైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారట. హీరోయిన్ ఎవరనే విషయాన్నీ త్వరలోనే ధ్రువీకరిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌వర్క్స్‌ ప్రై.లి, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు రూపొందిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్లు: రామ్‌లక్ష్మణ్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X