»   » ‘సర్దార్’ వేట మొదలైంది: ముగ్గురి అరెస్ట్

‘సర్దార్’ వేట మొదలైంది: ముగ్గురి అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే....బ్లాక్ మార్కెటింగ్, పైరసీ లాంటి సమస్యలు తెరపైకి వస్తాయి. బ్లాక్ మార్కెటింగ్ వల్ల సినిమా చూసే ప్రేక్షకులు నష్టపోవాల్సి వస్తోంది. పైరసీ వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు. అందుకే ఈ సమయంలో పోలీసులు ఈ రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

సర్దార్ సినిమా విడుల నేపథ్యంలో..... బ్లాక్ మార్కెటింగ్ గాళ్లను, పైరసీకి పాల్పడే వారిని వాటాడే ప్రక్రియ మొదలైంది. తాజాగా హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసారు. కుషాయిగూడలోని తుళ్లూరి సినిమా టాకీస్ పై ఎస్ఓటి పోలీసులు గురువారం మధ్నాహ్నం ఆకస్మిక దాడి చేయగా.....బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న ముగ్గురు దొరికిపోయారు. వారి వద్ద నుండి రూ. 21 వేల నగదు, ఒక బైక్, 650 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.


 Sardar Gabbar Singh Movie Black Tickets Sellers Arrested

ఇంత భారీ మొత్తంలో వీరి వద్ద టికెట్స్ లభించడంతో... థియేటర్ సిబ్బంది, లేదా యాజమాన్యం అండతోనే ఈ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా చోట్ల సర్దార్ గబ్బర్ సింగ్ మార్కెటింగ్ జరుగుతుందని అంటున్నా అభిమానులు.


పవన్ కళ్యాణ్, కాజల్ హీరో హీరోయిన్లుగా కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్ మరార్‌కు చెందిన నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్, పవన్ కళ్యాణ్ కు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్లో సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
Sardar Gabbar Singh Movie Black Tickets Sellers Arrested By Police in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu