»   » నాకు తెలిసి సెక్సీయస్ట్ డ్రస్సు అంటే చీర మాత్రమే..

నాకు తెలిసి సెక్సీయస్ట్ డ్రస్సు అంటే చీర మాత్రమే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా ఏదైనా అవార్డుల కార్యక్రమం జరిగినప్పుడు లేదా పంక్షన్లు జరిగినప్పుడు ఎవరెవరు ఎలాంటి డ్రస్సులతో వస్తారనేది ముఖ్యమైన విషయం. ఇది బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోకూడా. ఇదే రెడ్ కార్పెట్ మీద ఐతే ఫంక్షన్ కువచ్చిన అన్ని కెమెరా కళ్శు హీరోయిన్ డ్రస్సుల మీద ఉంటాయి. అదే విధంగా ఇటీవల జరిగినటువంటి 56వ ఐడియా ఫిలం ఫేర్ అవార్డుల న్యూస్ కాన్పరెన్స్ కార్యక్రమంలో అందరూ విద్యాబాలన్ సెక్సీ వస్టెరన్ అవుట్ పిట్ తో వస్తారేమో అనుకున్నారు. దానికి భిన్నంగా విద్యా బాలన్ మాత్రం తెలుగుతనం ఉట్టిపడేలా చాలా అందంగా అచ్చమైన చీర కట్టుకోని వచ్చి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తారు.

ఈసందర్బంలో విద్యా బాలన్ మాట్లాడుతూ నాకు చీర కట్టుకోవడం చాలా ఇష్టం. అంతేకాదు నాకు తెలిసి ప్రపంచంలో సెక్సీయస్ట్ డ్రస్సు ఏదైనా ఉంది అంటే అది చీర మాత్రమే అని అన్నారు. చీర కట్టుకుంటే మన శరీరానికి సంబంధించినటువంటి సైజులు, షేప్స్ విషయంలో కూడా మనకు ఇబ్బంది ఉండదు. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుందన్నారు. తర్వాత ఓ జర్నలిస్ట్ జనవరి 29 జరగనున్న 56వ ఐడియా ఫిలం ఫేర్ అవార్డుల కార్యక్రమానికి మీరు ఎలా వస్తారు అని అడడగా ప్రస్తుతానికి దాని గురించి ఏమి ఆలోచించలేదని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu