Bhagavanth Kesari: ఫ్యాన్సీ రేటుకు 'భగవంత్ కేసరి' ఓవర్సీస్ రైట్స్.. ఇది కదా బాలయ్య క్రేజ్
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి మూవీలో నటించిన సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఓవర్సీస్ లో ఫ్యాన్సీ రేటుకు ఈ మూవీ హక్కులను సరిగమప సినిమాస్ దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే....
ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. ఇక ఆఖండ సినిమా తర్వాత ఓటీటీ కంటెంట్ లోకి అడుగుపెట్టిన ఆయన అన్ స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ అన్ స్టాపబుల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆహాలో రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా తీసుకొచ్చారు. అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ షో తర్వాత కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

ఈ ఏడాది బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే సినిమాను తీశారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అంతే కాదు ఈ మూవీలో టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోందనే ప్రచారం సాగుతోంది.

భగవంత్ కేసరి మూవీలో బాలయ్యను ఢీ కొట్టేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే అర్జున్ రాంపాల్ కు సంబంధించిన షెడ్యూల్ మొత్తం పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. బాలయ్యతో కలిసి అర్జున్ రాంపాల్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు మేకర్స్. ఇక ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక భగవంత్ కేసరి మూవీలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపిస్తారంటూ ప్రచారం అయితే సాగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య మొదటిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే తాజా విషయం ఏమిటంటే... ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఫాన్సీ రేటుకు సరిగమ సినిమాస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులు సాధించుకున్నట్లు సమాచారం. మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి... డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోవడంతో పాటు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
భగవంత్ కేసరి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక భగవంత్ కేసరి అక్టోబర్ 18న యూఎస్ఏలో ప్రీమియర్ షోలు వేయనుంది.


Click it and Unblock the Notifications











