twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా రికార్డు బ్రేక్ చేసిన సరిలేరు నీకెవ్వరు.. మెగాస్టార్‌పై సూపర్‌స్టార్ ఆధిక్యం

    |

    మెగాస్టార్ చిరంజీవి.. దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వస్తోన్నాడు. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా ఆ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. దాదాపు పదేళ్లు ఆ స్థానంలో అలాగే ఖాళీగానే ఉండిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు గట్టి పోటీ ఇచ్చినా కానీ ఆ స్థానాన్ని అందుకోలేకపోయారు. మళ్లీ మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చి తన స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.

    రీఎంట్రీతో బాక్సాఫీస్ బద్దలు..

    రీఎంట్రీతో బాక్సాఫీస్ బద్దలు..

    చిరంజీవి తన కమ్‌బ్యాక్ చిత్రంగా తమిళ హిట్ మూవీ కత్తికి రీమేక్‌గా ఖైదీ నెంబర్ 150 చేశాడు. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పదేళ్లు గ్యాప్ ఇచ్చినా తన ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపించుకున్నాడు.

     సైరాతో మరోసారి హవా..

    సైరాతో మరోసారి హవా..

    స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స‌ృష్టించింది. అద్భుతమైన విజువల్స్, నటీనటులు తమ నటనతో సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టేశారు. ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాలను అవలీలగా చేసిన చిరు.. అభిమానులను ఆకట్టుకున్నాడు.

    రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరికీ పోటీ..

    రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరికీ పోటీ..

    తెలుగు నాట పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అత్యధికంగా పారితోషికాలు అందుకుంటారని టాక్. అయితే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆ విషయంలో మహేష్ టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. అయితే చిరంజీవి, మహేష్ బాబుల మధ్య ఇదే విషయమై పోటీ వస్తూనే ఉంటుంది.

     అత్యధికంగా అందుకుంటోన్న మహేష్..

    అత్యధికంగా అందుకుంటోన్న మహేష్..

    మహేష్ బాబు తన సినిమాలకు దాదాపు 50కోట్ల వరకు అందుకుంటాడని సమాచారం. అయితే చిరంజీవి తన రెండు సినిమాలను సొంత బ్యానర్‌లోనే చేయడంతో రెమ్యూనరేషన్ విషయాలు బయటకు రావడం లేదు. ఎంత తీసుకున్నా, ఇచ్చినా అది లెక్కలోకి రాదు. చిరు తన 153వ చిత్రం వేరే బ్యానర్‌లో చేస్తే.. ఆ నిర్మాత ఇచ్చే రెమ్యూనరేషన్ బట్టి చిరు రేంజ్ ఏ రేటును పలుకుతుందో అన్నది తెలుస్తోంది.

    Recommended Video

    Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
    సైరాను వెనక్కు నెట్టిన సరిలేరు..

    సైరాను వెనక్కు నెట్టిన సరిలేరు..

    అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సైరా చిత్రం హిందీ మార్కెట్‌లో.. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. సైరా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 9 కోట్లకు అమ్ముడుపోగా..సరిలేరు నీకెవ్వరు హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి 15.25 కోట్లకు సేల్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మన మాస్ సినిమాలకు హిందీలో గిరాకీ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలసిందే. సంక్రాంతి బరిలోకి దిగేందుకు జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    English summary
    Mahesh Babu Sarileru Neekevvaru Crossed Chiranjeevi Sye Raa Movie In Terms Of Hindi Dubbing Rights. Buzz Is That Sariler Neekevvaru Dubbing Rights Sold Higher Rate Than Sye Raa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X