సరిలేరు నీకెవ్వరు ఫస్ట్‌టాక్: సగటు ప్రేక్షకుడు ఏమంటున్నాడో మీరే చూడండి!
భారీ అంచనాలు, ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలైంది. ఇంకా రెగ్యులర్ షోస్ పడకముందే ప్రీమియర్స్ కోసం జనం పోటెత్తారు. ఓవర్సీస్‌తో పాటు ఆంధ్రాలో పలుచోట్ల గత అర్థరాత్రి సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ షోస్ చూసిన జనం ఏమంటున్నారో ఓ లుక్కేద్దామా..

పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ.. దద్దరిల్లింది
మహేష్ బాబు.. మరోసారి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు అంటున్నారు ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన జనం. అన్ని ఏరియాల్లో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. అంతేకాదు ''బొమ్మ దద్దరిల్లింది.. సంక్రాంతి బ్లాక్‌బస్టర్'' అని అంటున్నారు.

ఫుల్స్ మీల్స్ పెట్టారు.. ఫుల్ హ్యాపీ
ఈ సంక్రాంతికి అందరూ కోరుకునే సినిమా అందించారని జనం చెబుతున్నారు.
మహేష్ అభిమానులకు ఫుల్స్ మీల్స్ పెట్టారని అంటున్నారు. మహేష్ బాబును ఎలా అయితే చూడాలనుకున్నామో అంతకన్నా గొప్పగా చూపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడికి స్పెషల్‌గా ధన్యవాదాలు చెబుతున్నారు ఆడియన్స్. మొత్తానికి ''ఫుల్ హ్యాపీ'' అంటున్నారు.

మహేష్ కామెడీ టైమింగ్..
సరిలేరు నీకెవ్వరు సినిమాలో ముఖ్యంగా మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిందని టాక్ వినిపిస్తోంది. పవర్‌ఫుల్ కామెడీ పంచెస్, ట్రైన్ ఎపిసోడ్ సగటు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించిందని జనం చెబుతున్నారు. మహేష్ బాబు పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశాడని అంటున్నారు.

మహేష్ బాబు- రష్మిక కెమిస్ట్రీ
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని ఎక్కువ మంది చెబుతున్నారు. చిత్రంలో కొన్ని సీన్స్ ''నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అని ఒక్కమాటలో చెప్పేస్తున్నారు. మహేష్ బాబు- రష్మిక కెమిస్ట్రీ కూడా బాగుందని టాక్ వస్తోంది.

ఫస్టాఫ్ అంతా.. ఇంటర్వెల్ బ్యాంగ్
ప్రకాష్ రాజ్ ఎంట్రీ సీన్ స్పెషల్ కిక్ ఇచ్చిందని అంటున్నారు. ఫస్టాఫ్ అయితే మొత్తం కామెడీ ఎంటర్‌టైన్మెంట్ అని, ఇది సినిమాకే తలమానికం అని టాక్ నడుస్తోంది. అలాగే కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ ఇచ్చిందని.. మొత్తానికి ఫస్టాఫ్ ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు జనం.

రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు..
ఫస్టాఫ్ హైలైట్ సన్నివేశాలతో పోలిస్తే సెకండాఫ్ స్లో అయిందని టాక్. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు సాగతీతలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ప్రీక్లైమాక్స్‌లో వేగం పెంచారని, చివరగా క్లైమాక్స్ ఇంకా బాగా వస్తే అదిరిపోయేదని చెప్పుకుంటున్నారు జనం.
Recommended Video

ఓవరాల్ టాక్ చూస్తే..
ఇక ఓవరాల్ టాక్ చూస్తే మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాపై ప్రేక్షకుల స్పందన పాజిటివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా ప్రీమియర్స్ అంటే ఫ్యాన్స్ తాకిడి ఉంటుంది కాబట్టి.. రెగ్యులర్ షో పడ్డాక రివ్యూ రైటర్స్, ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి ఈ సినిమా ఎలా ఉందనేది పర్ఫెక్ట్‌గా అంచనా వేయొచ్చు.


Click it and Unblock the Notifications











