‘సరిలేరు’తో మహేష్ ముందుకు.. ‘అలా’ అల్లు అర్జున్ అక్కడే.. రాజీ కుదిర్చిన నిర్మాతలు

By Manoj Kumar P

సంక్రాంతి పండుగ అంటే కోళ్ల పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్‌కు పోటీగా పెద్ద హీరోల సినిమాలు బరిలోకి దిగడం ఆనవాయితి. అయితే ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పోటీపడేందుకు సిద్దపడ్డారు. అంతేగాకుండా ఒకే రోజు బాక్సాఫీస్ ముందు తలపడనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇక ఇరువురి హీరోల అభిమానులు తెగ సంబరపడిపోయారు. బాక్సాఫీస్ వద్ద తమ హీరో గెలుస్తాడంటే కాదు తమ హీరో గెలుస్తాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హల్ చల్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య పోటీ లేదని తాజాగా ఓ ప్రకటన చేశారు.

దూకుడుమీదున్న మహేష్..

దూకుడుమీదున్న మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన మహేష్.. మరోసారి దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతిబరిలోకి దిగిన పెద్ద చిత్రాలను వెనక్కునెట్టి మరీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 రికార్డుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

 చాలా గ్యాప్..

చాలా గ్యాప్..

ఎన్నో అంచనాలతో నా పేరు సూర్యను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన అల్లు అర్జున్కు నిరాశ మిగిలింది. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా అంతలా బెడిసి కొట్టేసరికి.. మరో ప్రాజెక్ట్ను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనివల్ల చాలా గ్యాప్ వచ్చేసింది.

హ్యాట్రిక్ దిశగా..

హ్యాట్రిక్ దిశగా..

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను చూస్తే ఓ మ్యాజిక్ గుర్తొస్తుంటుంది. సినిమాలోని డైలాగ్స్ అయినా, అల్లు అర్జున్ మ్యానరిజమైనా.. ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకంగానే నిలుస్తాయి. అయితే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మరోసారి మాయచేసి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

 పాటలతో సెన్సేషన్..

పాటలతో సెన్సేషన్..

అలవైకుంఠపురములో నుంచి విడుదలైన మొదటి సాంగ్.. సామజవరగమన. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ఈ పాట వైరల్‌గా మారింది. రెండో పాటగా విడుదలైన రాములో రాముల సాంగ్ మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పార్టీలు, పబ్‌లు, డీజేలు ఇలా ఎక్కడ చూసినా రాములో రాముల అనాల్సిందే. అలాగే మూడో పాటను నేడు విడుదల చేయనున్నారు.

ఒకేరోజు అంటూ ప్రకటన..

ఒకేరోజు అంటూ ప్రకటన..

జనవరి 12న ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయని సదరు నిర్మాతలు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి వీటిపై అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. మహేష్ బాబు పోస్టర్లతో సంచలనం సృష్టిస్తుండగా.. పాటలతో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఒకే రోజు సినిమాలు రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని ఆశపడిన ప్రేక్షకులకు నిరాశ కలిగించే ఓ అప్‌డేట్ వచ్చేసింది.

Recommended Video

#CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
ముందుకు వచ్చిన సరిలేరు..

ముందుకు వచ్చిన సరిలేరు..

ఇలాంటి పెద్ద చిత్రాలు ఒకే రోజును విడుదలైతే నష్టం వాటిల్లుతుందని సదరు నిర్మాతలు కూర్చొని మాట్లాడుకున్నారని, ఈ రెండూ ఒకే రోజు విడుదల కావడం లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అప్పుడు రూమర్లుగా కొట్టిపారేసినా.. తాజాగా అదే నిజమైంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానుందని, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కాబోతోందని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X