మహేష్ టీమ్‌కి ఊహించని షాక్.... ఆన్‌లైన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' పైరసీ! సూపర్ స్టార్ రిక్వెస్ట్
సినీ పరిశ్రమను ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న అంశం పైరసీ. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంటారు పైరసీ రాయుళ్లు. ఈ పైరసీ ఇష్యూపై ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా ఆ కేటుగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా పైరసీ ఉచ్చులో చిక్కుకోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన నింపుతోంది. పూర్తి వివరాలు చూస్తే..

సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న మహేష్..
తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.

మహేష్ టీమ్‌కి ఊహించని షాక్
సరిగ్గా ఈ పరిస్థితుల్లో సరిలేరు నీకెవ్వరు టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకి కూడా సినిమాకి కూడా పైరసీ తిప్పలు తప్పలేదు. తొలి షో తోనే మంచి టాక్ తెచ్చుకున్న మహేష్ టీమ్ ఆశలపై నీళ్లు చల్లారు పైరసీ కేటుగాళ్లు. రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఈ సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టేశారు.

45 నిమిషాల వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్
థియేటర్‌లో సెల్‌ఫోన్ ద్వారా రికార్డు 45 నిమిషాల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు పలు డాన్సింగ్ క్లిప్స్, మహేష్ సీన్స్ కూడా ముక్కలు ముక్కలుగా వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దీంతో మహేష్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఎన్నోకోట్లు పెట్టి తీసిన సినిమా ఇలా పైరసీ కావడంతో చిత్రయూనిట్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అభిమానులకు మహేష్ బాబు రిక్వెస్ట్
మరోవైపు ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' మూవీ పైరసీకి వ్యతిరేకంగా పని చేయాల్సిందిగా ఫ్యాన్స్‌కి పిలుపునిచ్చాడు హీరో మహేష్ బాబు. పైరసీకి సంబంధించిన వెబ్‌సైట్ లింక్స్‌ని మెయిల్ చేయాల్సిందిగా కోరుతూ జీమెయిల్ అడ్రెస్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు.
'సరిలేరు నీకెవ్వరు' మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో మహేష్ జోడీగా రష్మిక మందన్న నటించింది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. విజయశాంతి ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజా, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











