Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా, సూపర్ స్టార్ పాటలతో హోరెత్తిపోతున్న ఎల్బీ స్టేడియం.. అరుపులు, కేకలు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్లోనే 'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది చిత్రయూనిట్.
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలు హోరెత్తిపోతున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు పాటలకు డాన్సర్లు చేస్తున్న డాన్సులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని డైలాగులు కూడా ప్లే చేస్తూ జనాల్లో హుషారు నింపుతున్నారు. యాంకర్ సుమ స్టేజీపైకి వచ్చేసి మాట్లాగారడి ప్రారంభించింది. సుమ మొత్తానికి అక్కడి వాతావరణం చూస్తుంటే చిరంజీవి రాగానే ఆ ఉత్సాహం, అరుపులు ఊహలకు అందేలా లేవని తెలుస్తోంది.