twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarileru Neekevvaru PreRelease: మధ్యలో ఓ చిన్న తప్పు చేశా.. ఇక నుంచి సినిమానే జీవితం.. బండ్ల గణేష్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

    కొత్త అధ్యాయం..

    కొత్త అధ్యాయం..

    ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘టైటిల్‌లోనే చెప్పారు.. నిజంగానే సంక్రాంతికి మహేష్‌కు సరిలేరు నీకెవ్వరు అని చెప్పారు.. ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తైన మనసున్న మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి ఈ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా వస్తున్నారు.. ఇది తెలుగు సినీ చరిత్రకు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అయితే నేను నా హీరోలు, నా సినిమాలను ప్రమోట్ చేసుకునే వాడిని. కానీ, ఈ చిత్రానికి నన్ను నేనే ప్రమోట్ చేసుకుంటాను.

    చెప్పింది చేస్తావా..?

    చెప్పింది చేస్తావా..?

    ఒకరోజు శిరీష్ రెడ్డి గారు ఫోన్ చేశారు... ఏం చేస్తున్నావ్ ఎక్కడున్నావ్ అని అడిగాడు. ఏం లేదన్నా.. కోళ్ల ఫామ్‌లో కోడి గుడ్లు ఏరుతున్నా అని చెప్పాను. నేను చెప్పింది చేస్తావా? అని అడిగారు. ఏం చేయాలన్నా హైద్రాబాద్‌కు కోడి గుడ్లు తెచ్చివాలా? అని అడిగాను. అప్పుడు ఆయన.. నేను చెప్పింది కాదనకూడదు అని అన్నారు. మహేష్ బాబు సరిలేరు చిత్రంలో ఓ పాత్ర చేయాలని చెప్పాడు. సరే అని అన్నాను.

    మధ్యలో ఓ చిన్న తప్పు..

    అనిల్ రావిపూడిని కలిశాక నా పాత్ర గురించి చెప్పాడు. మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే పాత్ర అది. ముప్పై ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను.. మేనేజర్‌గా, నటుడిగా, ఓ స్టార్ హీరోవల్ల నిర్మాతగానూ అయ్యాను. మధ్యలో ఓ చిన్న తప్పు చేశాను. సుమ గారు చెప్పినట్టు 7 ఓ క్లాక్ బ్లేడ్.. అది వేస్ట్.. ఇది బెస్ట్ అని.. అందరితో యెర్రి డ్యాష్ అనిపించుకుని ఇక్కడికి వచ్చా.

    సినిమానే జీవితంగా

    సినిమానే జీవితంగా

    అనిల్ రావిపూడికి, దిల్ రాజుగారికి బ్లాక్ బస్టర్ అవుతుంది. మహేష్ కెరీర్‌లోనే కాదు. ఇండస్ట్రీలోనే నంబర్ వన్ అవుతుంది. మిమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ.. సినిమాలు తీస్తూ.. సినిమానే జీవితంగా బతకాల'ని అనుకుంటున్నానని తెలిపాడు.

    English summary
    Sarileru Neekevvaru Pre Release Event Live Updates. Chiranjeevi Is Chief Guest For Sarileru Event. Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi And Prakash Raj Are Main Lead. This Movie Is Going To Release On 11th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X