twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarileru Neekevvaru Pre Release Event : కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే.. ప్రభుత్వాలకు చిరంజీవి డిమాండ్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

    ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం..

    ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం..

    ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఇలా ఫ్యాన్స్ అందరూ కలిసికట్టుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి హెల్దీ వాతావరణం కావాలి. ఇలా అందరూ కలిసి ఉన్నందుకు మీ అందర్నీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. లేడీ అమితాబ్..లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగి.. అందరి హీరోలతో నటించి.. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా.. జాతియ స్థాయిలో ఉత్తమ నటి అయిన నా హీరోయిన్.. విజయశాంతికి హృదయపూర్వక అభినందనలు.

    నవ్వులో చిలిపి తనం..

    నవ్వులో చిలిపి తనం..

    మహేష్ బాబును చూస్తే బిడ్డలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ చెరగని నవ్వుతో ఉంటాడు. ఆ నవ్వులో కూడా ఓ చిలిపితనం ఉంటుంది. మహేష్ బాబు దొంగ. రష్మిక మందాన్న, తమన్నా, సంగీత, ఇతర నటీనటులందరికీ అభినందనలు. ఐదు చిత్రాల అనుభవంతోనే సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ రావడం అంత ఈజీ కాదు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారికి హృదయపూర్వక నమస్కారాలు.

    కత్తిలాంటి పోస్టర్..

    కత్తిలాంటి పోస్టర్..

    ఓసారి పేపర్ తిరిగేస్తుంటే..మహేష్ పోస్టర్ ఒకటి కనబడింది. కత్తిలా ఉంది.. అలానే చూస్తుండిపోయాను. మిలటరీ యూనిఫామ్‌లో ఉన్న పోస్టర్ చూసి..వెంటనే మహేష్కు మెసెజ్ చేశాను. ప్రతీ పోస్టర్ కత్తిలానే ఉంది. అది మాత్రం రెండు వైపులా పదును ఉన్న కత్తిలా అనిపించింది. నేను చేసిన మెసెజ్‌కు రిప్లై ఇచ్చాడు. చాలా బాగా ఉందని చెప్పాను. అయితే దాని తరువాత కొన్ని రోజులకే వచ్చి.. షూటింగ్ అయిపోయింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని కోరారు.

    మహేష్ నాంది పలికాడు..

    మహేష్ నాంది పలికాడు..

    మొన్నే కదా మనం మాట్లాడుకుంది.. ఈలోపే షూటింగ్ పూర్తయిందా? అని ఆశ్చర్యపోయాను. ఇంత తక్కువ సమయంలో ఇంత క్వాలిటీతో తీయాలి. అప్పుడే ఇండస్ట్రీ కలకలలాడుతుంది. అందరూ ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. కొరటాల శివ కూడా వంద రోజుల్లోనే పూర్తి చేయాలి.. అందరూ మాటిస్తున్నా.. వంద రోజుల్లోపే తీస్తావా? అంటూ కొరటాలతో మాట తీసుకున్నాడు. ఇలా తొందరగా పూర్తి చేయడంతో మహేష్ నాంది పలకడం సంతోషంగా ఉంది. తండ్రికి మంచి పేరు తెస్తున్న మహేష్‌ను చూస్తే గర్వంగా ఉంది.. కృష్ణ గారికి గొప్ప పేరు తీసుకొస్తున్నాడు.. మహేష్ బాబు తండ్రి కృష్ణ అనే స్థాయికి ఎదుగుతున్నాడు

    దాదా సాహెబ్ ఫాల్కే..

    దాదా సాహెబ్ ఫాల్కే..

    సౌతిండియాలోనే సీనియర్ హీరో కృష్ణకు రావాల్సినంతగా గుర్తింపు రాలేదని అనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. కృష్ణ గారికి దాదా సాహెబ్ ఫాల్కే తీసుకొచ్చేలా కృషి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా.. డిమాండ్ కూడా చేస్తున్నా. అది ఆయనకు మాత్రమే గౌరవం కాదు.. మనందరికీ గౌరవం. ఎన్నో సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, టెక్నాలజీని అంది పుచ్చుకుని, దాదాపు 350 సినిమాల్లో నటించి, నిర్మించిన ఆయనకు దాదా సాహెబ్ పురస్కారం వచ్చేలా ప్రభుత్వాలు క‌ృషి చేయాల'ని అన్నారు.

    చిరంజీవి-విజయశాంతి ఆలింగనం..

    చిరంజీవి-విజయశాంతి ఆలింగనం..

    రాజకీయంగా విజయశాంతి అప్పట్లో చిరును టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.అదే విషయాన్ని చిరు ప్రస్థావిస్తూ.. అలా ఎలా అనగలిగావని వేదికపైనే విజయశాంతిని ప్రశ్నించాడు. రాజకీయాలు వేరు..సినిమాలు వేరు.. మీరెప్పుడూ మా హీరోనే.. నేనెప్పుడూ మీ హీరోయిన్‌నే అని బదులిచ్చింది. రాజకీయాలు శత్రువులను పెంచుతుంది.. సినిమాలు మిత్రులను పెంచుతుందని చిరు కామెంట్ చేశారు.అనంతరం వీరిద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి ఈ సీన్ హైలెట్‌గా మారింది.

    English summary
    Sarileru Neekevvaru Pre Release Event Live Updates. Chiranjeevi Is Chief Guest For Sarileru Event. Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi And Prakash Raj Are Main Lead. This Movie Is Going To Release On 11th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X