Sarileru Neekevvaru PreRelease: దేవుడ్ని ఇంతకంటే ఏం అడగాలి.. ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ కావాలి.. సంగీత
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..
నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
హరితేజ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు సాదర స్వాగతం.. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి పాత్రను పోషించాను.. అనిల్ రావిపూడి గారితో హ్యాట్రిక్ కొట్టేశాను. ఈ సినిమాలో ట్రెయిన్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్.. మైండ్ బ్లాక్ అవుతంది. సరిలేరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫర్‌లా ఉంటుంద'ని చెప్పుకొచ్చింది.

మహేష్ చెల్లెలిగానే..
సింగర్ కౌముది మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్స్. మహేష్ బాబుగారితో ఇది సెకండ్ సినిమా. భరత్ అనే నేను సినిమాలో చెల్లెలి పాత్రను చేశాను. అందరూ అలానే గుర్తు పడుతున్నారు. ఈ చిత్రంలోనూ ఓ మంచి పాత్రను పోషించాను. విజయశాంతిగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అందరం ఫ్యామిలీలా అయిపోయామ'ని తెలిపింది.
దాదాపు పదేళ్ల తరువాత..
సంగీత మాట్లాడుతూ.. ‘దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ హైద్రాబాద్‌కు వచ్చాను.. ఇన్నేళ్లకు తెలుగులో అవకాశం వచ్చింది. ఇక సినిమాలు చేద్దామా? వద్దా? అనుకున్నప్పుడు..అనిల్ రావిపూడి లాంటి హిట్ దర్శకుడు ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీశాడు. అలాంటి ఓ దర్శకుడు వచ్చి ఓ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ చెప్పి.. అందులో ఓ మంచి పాత్ర చేయమన్నాడు. రష్మిక పక్కన మంచి పాత్రను చేశాను.

ఇంతకంటే ఏం అడగాలి..
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పక్కన, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించడం..దేవుడిని ఇంతకంటే ఏమి అడగాలి. నా సెకండ్ ఇన్నింగ్స్ ఓ మంచి సినిమాతో మొదలవుతోంది. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మీరంతా కలిసి ఈ చిత్రాన్ని సినీ ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ అయ్యేలా చేయండ'ని కోరింది.


Click it and Unblock the Notifications











