సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. మహేష్ పాటలతో సింగర్ సింహా సందడి
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది.
ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వబోతోన్నట్లు తెలుస్తోంది. సరిలేరు టైటిల్ సాంగ్‌ను దేవీ లైవ్‌గా పాడబోతోన్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ కూడా చేసేస్తున్నాడు. ప్రస్తుతం సింగర్ సింహా.. చిరు, మహేష్ సినిమాల్లోని పాటలతో అభిమానులను అలరిస్తున్నాడు. మహేష్ హిట్ చిత్రాల్లోని మాస్ పాటలను తన టీమ్‌తో కలిసిపాడి ఫ్యాన్స్‌లో జోష్ నింపేస్తున్నాడు. బిజినెస్‌మెన్, ఆగడు, శ్రీమంతుడు లాంటి చిత్రాల్లోని పాటలను పాడి ఎల్బీ స్టేడియంలో సందడి నింపాడు.


Click it and Unblock the Notifications











