ఎవ్వరూ ఊహించని విధంగా మహేష్‌, విజయశాంతి.. నిర్మాత కామెంట్స్

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేష్ బాబు జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఈ సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలో మహేష్‌ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

ఇక దాదాపు పదమూడేళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది లేడీ అమితాబ్‌ విజయశాంతి. ఈ సినిమాలో ఆమె ప్రత్యేక పాత్రలో నటించింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ సందర్బంగా నిర్మాత అనిల్ సుంకర కాసేపు మీడియాతో మాట్లాడుతూ విజయశాంతి పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు.

 SariLeru Neekevvaru producer comments on Vijayashanti, Mahesh Babu

పదమూడు సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు ఈ చిత్రంతో మనముందుకొస్తున్నారని, అలాగే ఆమె అవార్డు విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారని అన్నారు అనిల్ సుంకర. ఈ సినిమాలో మహేష్‌ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండి సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్పారు.

అసలు వారిద్దరి కాంబినేషనే పెద్ద సెల్లింగ్‌ ఫ్యాక్టర్‌ అని అన్నారు అనిల్. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్‌కి ప్రేక్షకుల నుండి విజిల్స్‌, క్లాప్స్‌ పడుతూనే ఉంటాయని, అవి లేనిచోట కన్నీళ్ళు పెడతారని ఆయన తెలిపారు. ఒక సందర్భంలో తప్ప సినిమా అంతా కూడా నవ్వుతూ, క్లాప్స్‌ కొడుతూ ఉంటారని అనిల్ సుంకర చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X