సరిలేరు నీకెవ్వరు: క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నతో మహేష్ రొమాన్స్ ఎలా ఉందంటే!
టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక మందన్న. ఛలో అంటూ టాలీవుడ్ గడపతొక్కి తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసి మాంచి కిక్కిచ్చిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబును బుట్టలో వేసుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఈ బడా హీరోతో రొమాన్స్ చేసింది. అయితే ఆ రొమాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? ఆ వివరాలేంటో చూద్దామా..

భారీ అంచనాల నడుమ సరిలేరు నీకెవ్వరు రిలీజ్
టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న కారణంగా 'సరిలేరు నీకెవ్వరు' పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆకాశాన్నంటే అంచనాల నడుమ ఈ రోజు (జనవరి 11) సినిమా విడుదలైంది. మరోవైపు ఓవర్సీస్‌తో పాటు కొన్ని ఏరియాల్లో గతరాత్రి నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి.

ప్రీమియర్ టాక్.. జనం దృష్టాంతా వీళ్లపైనే
'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీమియర్ షోస్ చూసిన జనం.. ఎక్కువ ఫోకస్ మొదట మహేష్ బాబుపై పెట్టగా, ఆ తర్వాత క్రేజీ భామ రష్మిక మందన్న పైనే పెట్టారు. ఈ ఇద్దరి రొమాన్స్, లవ్ ట్రాక్‌పై జనం కన్ను పడింది. ఈ ఇద్దరి జోడీ ఏ మేర అట్రాక్ట్ చేసిందనే దానిపై వారు స్పందిస్తున్నారు.

ఆర్మీ మేజర్.. మహేష్ బాబు
ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. ఆయన యాక్షన్ సీన్స్ సూపర్ అంటున్న ప్రేక్షకులు, కామెడీ టైమింగ్ కూడా బాగుందని కితాబిస్తున్నారు. అయితే మహేష్ బాబు- రష్మిక మందన్న జోడీ మాత్రం అనుకున్న రేంజ్‌లో అలరించలేక పోయిందని టాక్ వినిపిస్తోంది.

మహేశ్‌తో రష్మిక మందన్న ప్రేమాయణం
ట్రైన్ జర్నీలో మహేశ్‌ను రష్మిక మందన్న చూడడం, ఆయన ప్రేమలో పడడం.. ఆ తర్వాత తన తండ్రి రావు రమేష్ చూసిన పెళ్లి నచ్చకపోవడం సీన్స్ బాగానే వచ్చాయని అంటున్నారు. కాకపోతే ఈ చిత్రంలో రష్మిక మందన్న చిన్న పిల్లలా అనిపించిందని చెబుతున్నారు. డ్యాన్సుల వరకు ఓకే అనిపించినా చాలా చోట్ల గ్లామర్‌తో మెప్పించలేకపోయిందని టాక్ నడుస్తోంది.

మొత్తంగా చూస్తే.. ప్రీమియర్స్ ద్వారా
మరోవైపు మొత్తంగా చూస్తే ప్రీమియర్స్ ద్వారా సరిలేరు నీకెవ్వరు సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నట్లే తెలుస్తోంది. దీంతో ఈ రోజు థియేటర్స్ వద్ద అభిమానుల తాకిడి మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పైగా సంక్రాంతి సెలవులు, శనివారం కాబట్టి ఈ రోజు థియేటర్లన్నీ మహేష్ బాబు అభిమానులతో కళకళలాడటం ఖాయమని తెలుస్తోంది.
Recommended Video

సరిలేరు నీకెవ్వరు మూవీ
దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన సరిలేరు నీకెవ్వరు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











