ఇరగదీసిన సితార.. మహేష్ కూతురి వీడియో వైరల్.. తమన్నా రియాక్షన్
మహేష్ బాబు గారాల పట్టి సితార ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. తండ్రి సినిమాల్లోని పాటలు, డైలాగులను ఇమిటేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మహేష్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ''డ్యాంగ్ డ్యాంగ్'' పాటకు డాన్స్ చేసి వావ్!! అనిపించుకుంది సితార.

సరిలేరు నీకెవ్వరు.. మహేష్, తమన్నా
సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌తో ఇరగదీసిన సంగతి తెలిసిందే. ''డ్యాంగ్ డ్యాంగ్'' అంటూ మహేష్ బాబును పార్టీకి పిలుస్తూ రెచ్చిపోయింది మిల్కీ బ్యూటీ. ఈ సాంగ్ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్ అయి సినిమా విజయంలో భాగం పంచుకుంది.

డ్యాంగ్ డ్యాంగ్.. మామూలు హైప్ కాదండోయ్!
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని పాటలన్నింటిలో ''డ్యాంగ్ డ్యాంగ్'' పాటకు మాంచి హైప్ వచ్చింది. న్యూ ఇయర్ కానుకగా ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సత్తా చాటాడు. ఇప్పటికీ ఎక్కడ చూసినా ఇదే పాట మోగుతుండటం విశేషం.

తమన్నా కామెంట్.. అప్‌కమింగ్ స్టార్
ఇకపోతే సితార స్టెప్పులు చూసిన తమన్నా ఫిదా అయిపొయింది. 'సో క్యూట్..' అని కామెంట్ చేస్తూ సితార డాన్స్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. మరోవైపు నెటిజన్లు సైతం ''సూపర్ సితార, అప్‌కమింగ్ స్టార్'' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఫ్యామిలీతో సరదాగా
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ప్రస్తుతం ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్‌లో ఉన్నారు. అమెరికాలో కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా అక్కడే గడపనున్న మహేష్ మే నెల నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.
Recommended Video



Click it and Unblock the Notifications











