twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సరిలేరు నీకెవ్వరు' సెట్‌లో గంగవ్వ పరేషాన్.. అనిల్ రావిపూడికి దిమ్మతిరిగే ప్రశ్నలు

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్‌పై స్పెషల్ గెస్ట్ అయింది 'మై విలేజ్ షో ఫేం' గంగవ్వ. ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడితో, చిత్రయూనిట్ తో మాట్లాడి తెగ సందడి చేసింది ఈ ముసలవ్వ. అప్పటి ముచ్చట్లు, ఇప్పటి ముచ్చట్లు చెబుతూ సెట్‌లో హుషారు తెప్పించింది. ఆ వివరాలు చూద్దామా..

     సెట్‌లో పరేషాన్ చేసిన గంగవ్వ

    సెట్‌లో పరేషాన్ చేసిన గంగవ్వ

    'మై విలేజ్ షో ఫేం' టీమ్‌ అంతా కలిసి 'సరిలేరు నీకెవ్వరు' టీమ్‌ని కలిశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం నిర్మించిన విలేజ్‌ సెట్‌లో ‘మై విలేజ్‌ షో' యూట్యూబ్‌ ఛానల్‌ సభ్యులు సందడి చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ సెట్‌లో అందరినీ పలకరిస్తూ పరేషాన్ చేశేసింది.

     ఎవలు నువ్వు? అంటూ పోజులు

    ఎవలు నువ్వు? అంటూ పోజులు

    ఏకంగా డైరక్టర్ అనిల్ రావిపూడిని పట్టుకొని ఎవలు నువ్వు? ఈడెందుకు ఉన్నవ్.. అంటూ తన మాటలతో గమ్మత్తు చేసింది గంగవ్వ. ఆమె చేసిన సందడితో సెట్‌లో అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయశాంతిని కూడా కలిసి వారితో ఫొటోలకు ఫోజిచ్చింది గంగవ్వ.

    హీరోయిన్ కావాలని ఆశపడ్డ ముసలవ్వ

    హీరోయిన్ కావాలని ఆశపడ్డ ముసలవ్వ

    ఆ తర్వాత అనిల్ రావిపూడిని ఇంటర్వ్యూ చేసిన గంగవ్వ.. ‘నన్ను హీరోయిన్‌గా పెట్టుకుని సినిమా తీస్తావా' అని అడిగింది. వెంటనే అనిల్.. ‘హీరోగా ఎవరిని పెట్టాలి' అని అడగటంతో నీ ఇష్టం అనేసింది గంగవ్వ. వీరిద్దరి ముచ్చట్లు చూస్తూ సెట్ లోని అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

    గంగవ్వ ముచ్చట్లు.. అనిల్ ఫ్లాట్

    గంగవ్వ ముచ్చట్లు.. అనిల్ ఫ్లాట్

    ‘సినిమాలు మానేసిన విజయశాంతి ఇప్పుడు చేయడం లేదా? నేను కూడా చేస్తా' అంటూ.. గంగవ్వ పెట్టిన ముచ్చట అక్కడున్న అందరినీ పరేషాన్ చేసింది. గంగవ్వ ముచ్చట్లు తనను చాలా ఆనందింపజేశాయని డైరెక్టర్ అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సందర్బంగా సినిమా విశేషాలు తెలిపారు అనిల్.

    విజయశాంతి ఇల్లు

    సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో విజయశాంతి ఇల్లు కోసం వేసిన సెట్ ఇది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ వేసిన ఈ సెట్ సినిమాలోనే స్పెషల్ కానుందని తెలుస్తోంది. మరో రెండు పాటలు మినహా ఈ సినిమా అంతా పూర్తయిందని అనిల్ చెప్పారు.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
     రష్మిక మందన్నతో మహేష్ రొమాన్స్

    రష్మిక మందన్నతో మహేష్ రొమాన్స్

    'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. జనవరి 11న ఈ మూవీ విడుదల కానుంది.

    English summary
    Mahesh Babu doing his next project with Anil Ravipudi as SariLeru Neekevvaru. You tube star Gangavva visited this movie sets and enjoyed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X