సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్ రివ్యూ: ఫస్ట్ షో పడిపోయింది.. బొమ్మ దద్దరిల్లి..

Recommended Video

Sarileru Neekevvaru Movie Twitter Review

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ అంచనాలతో సిద్ధమైంది. ఓవర్సీస్‌లో తెలుగు రాష్ట్రాల కంటే ముందే ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఎలా ఉందంటే..

Sarileru neekevvaru Twitter review

ఆర్మీ ఎపిసోడ్

ఫస్టాఫ్, ఆర్మీ ఎపిసోడ్ విషయంలో అనిల్ రావిపూడి కుమ్మేశాడు. మహేష్ నెవర్ భిపోర్.. నెవర్ ఆఫ్టర్. ఒక ఓ రకమైన యాక్టింగ్‌కు బై బై అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్

దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కామెడీ, మహేష్ టైమింగ్ అదిరింది. బాబు ఎనర్జీ లెవెల్స్ ఇంకా సూపర్ అంటూ మరో ట్విట్‌లో సినిమా గురించి నెటిజన్ కామెంట్ చేశారు.

బొమ్మ బ్లాక్ బస్టర్‌గా

మిలిటరీ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్ ఫస్టాఫ్‌లో హైలెట్‌గా నిలిచాయి. సూపర్‌స్టార్ ఫెర్ఫార్మెన్స్ కళ్లకు ఓ విందులా అనిపిస్తుంది. ప్రామిస్ చేసినట్టే దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఇచ్చాడు. దాంతో బొమ్మ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఫస్టాఫ్ అయిపోయింది.

ఫస్టాఫ్ అయిపోయింది. సూపర్‌గా ఉంది. ఆర్మీ సీన్లు కేక..ట్రైన్‌లో కామెడీ బాగుంది. డాంగ్ డాంగ్ సాంగ్ సూపర్. కొండారెడ్డి బురుజు సీన్ అయితే దీనమ్మ అరాచకం. బాబు మాస్.. అరిపించాడు అంటూ మరో ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు.

ఫస్టాఫ్ తర్వాత

ఫస్టాఫ్ చూసిన తర్వాత సరిలేరు నీకెవ్వరూ బ్లాక్‌బస్టర్ కావడమనేది ఎవరూ ఆపలేరు.. అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

సినిమా అదిరిపోయింది.

సినిమా అదిరిపోయింది. అద్భుతమైన కంటెంట్ ఇచ్చినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్యూ సోమచ్ అంటూ మరో నెటిజన్ ట్వీట్

అసలు మహేష్ బాబు సత్తా ఏమిటో

అసలు మహేష్ బాబు సత్తా ఎమిటో సెకండాఫ్‌లో అనిల్ రావిపూడి చూపించాడు. ప్రకాశ్ రాజ్‌ను ఎదుర్కొనే సీన్లు కేక పెట్టించాయి. ఫ్యాన్స్‌కు పండగ లాంటి వాతావరణమే.

రోమాలు నిక్క బొడవకపోతే

ఇంటర్వెల్ సీన్‌లో రోమాలు నిక్కబొడవకపోతే.. నా అకౌంట్‌ను డిలీట్ చేసుకొంటాను అని ఓ నెటిజన్ సవాల్ చేసేంతగా రెచ్చిపోయి ట్వీట్ చేశాడు.

మహేష్‌కు దిమ్మ తిరిగే హిట్

మహేష్ బాబుకు సరిలేరు నీకెవ్వరూ మూవీ అతిపెద్ద హిట్. థ్యాంక్యూ అనిల్ రావిపూడి. ఫ్యాన్‌గా ఇంతకంటే ఏమీ అడుగలేము. చాలాకాలం తర్వాత మంచి సినిమాను ఇచ్చారు. ఫస్టాఫ్ సూపర్.. సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

క్లైమాక్స్ ఇరుగదీసింది

సెకండాఫ్‌లో బాబు మార్క్ ఎపిసోడ్స్ బాగున్నాయి.
వార్నింగ్ సీన్ తోపు
క్లైమాక్స్ ఇరుగదీసింది
మైండ్ బ్లాక్ సాంగ్.. ఫ్యాన్స్‌ కి పండుగే
అనిల్ రావిపూడికి తలవంచి మొక్కాలనిపిస్తున్నది.

ఒక్కడు కూడా సీట్లో కూర్చొడు

మైండ్ బ్లాక్ సాంగ్‌కు ఫ్యాన్ అనే వాడు ఒక్కడు కూడా సీట్లో కూర్చొడు. ఇప్పటి వరకు మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

థియేటర్లోకి వచ్చేసింది

సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లోకి వచ్చేసింది. తొలి ఆట మొదలైంది అంటూ హాలులో సినిమా మొదలైనట్టు సెన్సార్ సర్టిఫికెట్‌ను ట్వీట్ చేశారు.

మహేష్‌పై ఓ ఎమోషనల్

సరిలేరు నీకెవ్వరు సినిమా ఆరంభంలో మహేష్‌పై ఓ ఎమోషనల్ సన్నివేశం.. అంటూ ట్వీట్

సరిలేరు ఆట మొదలైంది

సరిలేరు ఆట మొదలైంది.. స్క్రీన్ పై టైటిల్స్ రోల్ అవుతున్నాయి అని ట్వీట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X