మరోసారి సత్తా చాటిన 'సరిలేరు నీకెవ్వరు'.. నెవర్ బిఫోర్ రికార్డ్
మహేష్ బాబు క్రేజ్ ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎలా ఉంటుందో మరోసారి ఋజువయ్యింది. సాధారణంగా ప్రస్తుత రోజుల్లో టీవీల్లో సినిమాలు చూడడం తగ్గించేస్తున్నారు. డిజిటల్ మీడియా వచ్చిన తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చని లైట్ తీసుకునేవారు ఎక్కువవుతున్నారు. అయితే మహేష్ సినిమాను మాత్రం జనాలు టీవీలలో ఎన్నిసార్లు వచ్చినా కూడా వదలడం లేదు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల సెకండ్ టైమ్ జెమిని టీవీలో టెలిక్యాస్ట్ అయినప్పటికీ అదే తరహాలో రేటింగ్ అందుకోవడం విశేషం. దాదాపు ప్రీమియర్స్ కి అందుకున్న రేంజ్ లో 17.4 రేటింగ్ అందుకున్న సరిలేరు నీకెవ్వరు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ అలాగే ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో పాటు అనిల్ రావిపూడి మేకింగ్ ఆడియెన్స్ కి బాగా నచ్చడంతో నెవర్ బిఫోర్ రికార్డ్ అందుకుంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకుంది. ఇక మహేష్ తో దర్శకుడు అనిల్ రావిపూడి మరో సినిమాకు చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ వచ్చే ఏడాది అనిల్ తో మరో సినిమా చేసే ఛాన్స్ ఉండవచ్చు.


Click it and Unblock the Notifications











