మేఘనా నాయుడికి చీరల దానం
చిన్న చిన్న గుడ్డ పేలికలను ధరించి, అందాలను బయటపెట్టి కుర్రకారును తప్పు దోవ పట్టిస్తున్న ఇద్దరు బాలీవుడ్ భామలకు వారణాసికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్ధ వినూత్న పద్ధతిలో నిరసన తెలుపుతోంది. వీరు కొన్ని చీరల దుకాణాల యజమానులను ఒప్పించి, కొన్ని చీరలను సేకరించి మేఘనా నాయుడు, రాఖీ సావంత్‌లకు పోస్టులో పంపాలని ఈ స్వచ్ఛంద సంస్ధ నిర్ణయించి, అప్పుడే రంగంలోకి దిగింది. తనూశ్రీ దత్తా, సమీరారెడ్డి, అభినయశ్రీ వంటి వారి కోసం హైదరాబాద్‌లో కూడా ఇలా చీరలు సేకరించి పంపాల్సిన అవసరం ఉంది. వంటి నిండా ధరించేటంత దుస్తులను కొనుక్కోడానికి మేఘనకు, రాఖీకి డబ్బు లేదేమోనని వారణాసి సంస్ధ చురక వేసింది. చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత మహాదేవ అన్నట్టున్న ట్రెండ్స్‌ను ఎవరు ఆపగలరు?


Click it and Unblock the Notifications