twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ హీరోయిన్ సరిత పై భర్త కుట్ర

    By Srikanya
    |

    చెన్నై : అలనాటి హీరోయిన్ సరితకు ఆమె భర్త నుంచి సమస్యలు మొదలయ్యాయి. తనపై కుట్ర పన్నుతున్నారంటూ ఆమె ఆరోపించారు. తన సహ నటుడు ముఖేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే మండిపడుతున్నారు. మనస్పర్దలు వచ్చి విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్న వీరు... విడాకులకై కేరళలోని ఎర్నాకులం ఫ్యామిలీ వెలఫేర్ కోర్ట్ లో పిటీషన్ ధాకలు చేసారు. ఆగస్టు 27,2014కి ఈ కేసుని మెజిస్టేట్ వాయిదా వేసారు.

    అయితే ఈ కేసు వ్యవహారంలో తనకు నోటీసులు సక్రమంగా అందటం లేదని, అందులో తన భర్త పాత్ర ఉందనే అనుమానం ఉందంటూ ఆరోపణలు చేసారు. వివాహ రద్దు విషయంలో తన వాదన వినిపించటానికి తగిన సమయం కేటాయించటం లేదని ఆమె వాపోయారు.

    చట్టవిరుద్ధంగా తన భర్త (మలయాళ నటుడు ముఖేష్‌) రెండో వివాహం చేసుకున్నారని.. ఆయనపై కేసు పెట్టనున్నట్లు సినీనటి సరిత పేర్కొన్నారు. మరోచరిత్ర, కోకిలమ్మ, అచ్చమిల్త్లె అచ్చమిల్త్లె తదితర చలన చిత్రాల్లో నటించి ఆమె గుర్తింపు పొందారు. అభిప్రాయభేదాల కారణంగా తాను, భర్త వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలిపారు.

    saritha filled petition in court

    తన మొదటి కుమారుడు షర్వన్‌ దుబాయ్‌లో వైద్య కోర్సు చేస్తున్నాడని, రెండో కుమారుడు తేజస్సు డిగ్రీ చదువుతున్నాడని వివరించారు. వారికి తోడుగా తాను కూడా అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన భర్త ముఖేష్‌ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాను ముఖేష్‌పై కేసు పెట్టానని తెలిపారు.

    సరిత చెప్పిన వివరాల ప్రకారం... 1988 ముఖేష్‌ మాధవన్‌తో కేరళలో సరిత వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. 2007లోనే ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ సరిత కోర్టుకు వెళ్లగా....ముఖేష్ విడాకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత 2009లో పరస్పర అంగీకారంతో కూడిన విడాకులు కోరుతూ చెన్నరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. అయితే ముఖేష్ కోర్టుకు సరిగా హాజరుకాని కారణంగా....ఆమె ఆ పిటీషన్ 2010లో ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం సరిత ఇద్దరు కుమారులు శ్రవణ్, తేజా్ దుబాయ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారి ఆలనా పాలన చూస్తు వారితో పాటే ఉంటున్నారు సరిత. ఈ లోగా విడాకులకై అప్లై చేసారు.

    English summary
    Saritha has filed a petition at Ernakulam family court challenging the divorce granted to Mukesh earlier by the court, arguing that the divorce was not complete as prior notice was not served to her. Saritha sought a directive to set aside the order and consider the plea as fresh matter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X