సర్కారు వారి పాట కోసం మహేష్ సెంటిమెంట్.. రీలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు అదృష్టవశాత్తు ఈ ఏడాదిని మిస్ కాలేదు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా మంది అగ్ర హీరోల సినిమాలు ఈ ఏడాదిలోనే రావాల్సి ఉండగా అనుకోకుండా కరోనా ధాటికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక సర్కారు వారి పాటతో సిద్ధం కానున్న మహేష్ బాబు ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.
గీత గోవిందం వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. అయితే సినిమా షూటింగ్ ను సమ్మర్ ఎండింగ్ లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో మహేష్ శ్రీమంతుడు సెంటిమెంట్ ను ఫాలో కానున్నట్లు సమాచారం. 2021లో ఆగస్టు 21న సర్కారు వారి పాట మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే రిలీజ్ డేట్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చని టాక్.

2015లో అదే తేదీన వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా టాప్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నెక్స్ట్ ఈ అదే తేదీన సర్కారు వారి పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో ఒక సీనియర్ హీరో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











