వర్మ 'ఇంటలెక్చువల్ రేప్'?, 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' నాదే: జయకుమార్ సంచలనం
స్త్రీ-పురుషుల మధ్య లైంగిక సంబంధాల విషయం పచ్చి బూతుగా మారిపోయిన సందర్భమిది. 'సెక్స్' అని కనిపిస్తే చాలు.. వెంటనే దానిలోకి తొంగిచూసేయాలన్న ఆసక్తి. అంతటి ఆకర్షణ ఉన్న ఆ విషయాన్ని చాలామంది బూతు కోణంలోనే చూస్తారు.
బహుషా ఇండియాలో ఓషో లాంటివాళ్లు మాత్రమే దాని వెనకాల ఉన్న తాత్వికత గురించి చెప్పగలిగారు. ఇప్పుడు వర్మ కూడా శృంగార తాత్వికతను బోధించే పనిని ముందేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పనికి అప్పుడే వివాదాలూ మొదలయ్యాయి.

కాపీ వివాదం:
'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' కథ నాదే అంటూ జయకుమార్ అనే రచయిత తెరపైకి వచ్చాడు. తాను గతంలో రామ్‌గోపాల్ వర్మకు ఓ కథ వినిపించానని, జీఎస్‌టీ ట్రైలర్‌లో అచ్చుగుద్దినట్లు అదే చూపించారని ఆయన ఆరోపిస్తున్నారు.

'ఇంటలెక్చువల్ రేప్':
' జీఎస్‌టీ అనే కంటెంట్ నేను రాసిన బుక్ కమ్ స్క్రిప్టు లోనిది. చదివి దానిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఆర్జీవికి పంపించాను. జీఎస్‌టీ ట్రైలర్ చూసి షాక్ తిన్నాను. నా కథకు కార్బన్ కాపీలా ఉంది. ఎంతలా అంటే.. ట్రైలర్‌లో మియా మల్కోవా పలికిన మొదటి వర్డ్ నుంచి చివరి పదం వరకు అంతా నా స్క్రిప్టులోనిదే. నన్ను సంప్రదించకుండా నా స్క్రిప్టు వాడుకోవడం 'ఇంటలెక్చువల్ రేప్'.

నా కథే దించేశారు..:
జీఎస్‌టీ ట్రైలర్ చూసి షాక్ తిన్నానని జయకుమార్ అన్నారు. ఈ విషయంలో కోర్టులోనే తేల్చుకుంటానని అంటున్నారు. కాగా, రచయిత జయకుమార్ గతంలో సర్కార్-3కి కథ అందించారు.

వర్మ రియాక్షన్?:
వివాదాస్పద కథాంశాలతో వార్తల్లోకి ఎక్కడం వర్మకు కొత్తేమి కాదు. మీడియా ఛానెళ్లు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చి పెడుతాయి కాబట్టి ఆయన కూడా వెనక్కి తగ్గరు. జయకుమార్ ఆరోపణలతో ఇప్పుడు 'జీఎస్‌టీ' కూడా వివాదాస్పదమైనట్లే. మరి వర్మ నుంచి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందో చూడాలి.

దీని పైనే చర్చ:
జనవరి 26 ఉదయం 9 గంటలకు వర్మ విడుదల చేయబోయే '
జీఎస్‌టీ' పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. నిజానికి వర్మ పోర్న్ సినిమా చూపించబోతున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తాత్విక చింతనను మిక్స్ చేసి ఆయన విడుదల చేసిన ట్రైలర్ చాలామందిని ఆశ్చర్యపరిచింది.

బోల్డుగానే వదులుతాడా?:
షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం అంటూ వర్మ 'జీఎస్‌టీ'ని రూపొందిస్తున్నాడు. సినిమాలో వర్మ తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి శృంగార పరిధిని తగ్గిస్తాడా?.. లేక బోల్డుగానే సినిమాను వదులుతాడా? అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











